March 2, 2013
నిర్మోహమాటంగా....

విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులనే నిలబెట్టాలి : గొట్టుముక్కల రవి
మిత్రపక్షాల వల్ల సీట్లు కోల్పోతున్నాం. తొమ్మిదేళ్లగా ప్రజలు నరకం చూస్తున్నారు : శ్రీనివాసగుప్తా
కాల్వగట్ల వాసులు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి పార్టీ తరుపున పోరాడాలి : సుభద్ర
ఒకటో డివిజన్‌లో సమర్థవంతమైన నాయకుడిని నిలబెటితే విజయం తధ్యం : మురళీదేవి
టీడీపీలోమహిళలను ఆదరించాలి. వాంబే కాలనీలో ఇళ్ళపై తీసుకున్న అప్పులను మాఫీచేయాలి : దేవమణి
టీడీపీ శ్రేణులే ఎమ్మెల్సీని ఓడించారు. స్మార్ట్‌కార్డు వ్యవస్థను రద్దుచేయాలి : జిల్లేపల్లి సుధీర్‌బాబు, జగ్గయ్యపేట
గ్రామంలో నాలుగైదు గ్రూపులు ఏర్పడ్డాయి. దాంతో పార్టీ బలహీన పడుతుంది : తాళ్ళూరి వెంకటేశ్వర్లు
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి పార్టీ అండగా నిలవాలి : శ్రీనివాస్
సీనియర్ కార్యకర్తలను గుర్తించాలి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, పార్టీనేతలు తిరగాలి : శ్రీనివాసరావు(వాసు)
గ్రామస్థాయిలో నేతలు తిరుగుతూ కష్టపడాలి: నాగమల్లేశ్వరరావు
తన భర్త చనిపోయి ఇబ్బందుల్లో ఉంటే పార్టీనేతలు ఆర్థికంగా ఆదుకున్నారు. పదో తరగతి చదివే తన కుమారుడిని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించాలి: మండాది కరుణకుమారి
పార్టీలో విబేధాలు క్యాన్సర్‌కంటే ప్రమాదం. పార్టీకి నష్టంచేసే పరిస్థితి వస్తే సహించేది లేదంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. కార్యకర్తల సలహాలను, సూచనలను ఓపికగా విన్న చంద్రబాబు వాటిని నోట్ చేసుకున్నారు.
Posted by
arjun
at
2:53 AM