March 3, 2013
సాగునీరివ్వలేక చేతులేత్తేశారు

వర్గీకరణపై కాంగ్రెస్‌కు సవాల్
వర్గీకరణపై కాంగ్రెస్ వైఖరి స్పష్టంచేయాలని చంద్రబాబు సవాల్ విసిరారు. వర్గీకరణకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. మాదిగలకు రిజర్వేషన్‌లు అమలు సక్రమంగా జరగడంలేదంటూ, 40ఏళ్ళలో 16 వేల ఉద్యోగాలు మాదిగలకు దక్కగా, టీడీపీ చేసిన వర్గీకరణ అమలుతో నాలుగేళ్ళలో 24 వేల 500 ఉద్యోగాలు లభించాయన్నారు. వర్గీకరణపై 2004లో కొందరు కోర్టుకు వెళ్ళడంతో ఆటంకం ఏర్పడిందని, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సక్రమంగా స్పందించి ఉంటే న్యాయం జరిగేదన్నారు.
ముందుచూపులేని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు
పమిడిముక్కల మండలం హనుమంతాపురంలో చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ అవసరాలపై ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు ముందు చూపులేకపోవడం వల్లేనే ప్రస్తుత సంక్షోభానికి కారణమన్నారు. అధికారంలోకి రాగానే మహిళల రక్షణకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తానని బాబు అన్నారు.
Posted by
arjun
at
3:54 AM