March 22, 2013
ప్రజల కోసం మనం గెలవాలి

జనం ఆమోదం ఉంటే గెలుస్తాడనే నమ్మకం ఉంటే అటువంటి అభ్యర్థిని దేవుడు కూడా మార్చలేరని మీరు మూకుమ్మడిగా వచ్చినా తాను అటువంటి వ్యక్తికే మద్దతు ఇస్తానన్నారు. ఎ మ్మెల్యేలు, ఇన్‌చార్జిలు వేర్వేరుగా గ్రూ పులు కట్టవద్దని ఆయన సూచించారు. నాయకుడు బలహీనంగా ఉంటే అక్క డ పార్టీ కూడా బలహీనంగా ఉంటుందని కొందరిలో ఆభద్రతభావం, అవగాహన రాహిత్యం, కావాలని తప్పులు చేయడం వంటివి ఉన్నాయని వాటిని సీరియస్‌గా తీసుకుంటానన్నారు. క్ర మశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తానని బహునాయకత్వం వల్ల ఇల్లు, రాష్ట్రం కూడా బాగుపడదని, ఒకే వ్యక్తి న్యాయకత్వం అవసరమన్నారు.
మన పార్టీకి కార్యకర్తలే బలమని ఇటువంటి బలం ఏపార్టీకి లేదని చెప్పారు. కార్యకర్తలంతా అభ్యర్థులను గెలిపిస్తే కార్యకర్తలను ఆదుకునే బాధ్యత తనదన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్త లు, నాయకుల సూచనలను ఆయన విన్నారు. ఇవాళ ప్రజలు నన్ను చూడటానికి వస్తున్నారంటే తానేమి సినిమా యాక్టర్‌ను కాదని, కాంగ్రెస్ పాలనలో విసుగిపోయి అవినీతి వల్ల దెబ్బతింటున్న ప్రజలు టీడీపీ కావాలని ముం దుకు వస్తున్నారని చెప్పారు. తాను చా లా బాగుండాలని అనుకుంటానని కా ని కొన్ని పరిమితులు ఉంటాయని అందువల్ల వచ్చిన అవకాశాన్ని కార్యకర్తలు, నాయకులు వినియోగించుకోవాలని సూచించారు.
తెలుగుదేశం పార్టీ వల్ల తనకు గుర్తింపు వచ్చిందని దానిని మరచిపోలేనని, కార్యకర్తలు, నాయకు లు కూడా అదేవిధంగా ఉండాలన్నా రు. సమావేశంలో పొటిట్‌బ్యూరో స భ్యుడు యనమల రామకృష్ణుడు, ము రళీమోహన్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మెట్ల సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు, చిక్కాల రామచంద్రరా వు, నిమ్మకాయల చినరాజప్ప, గన్ని కృష్ణ, రుద్రరాజు వెంకటరామరాజు, పులపర్తి నారాయణమూర్తి, బత్తుల రా ము, నామన రాంబాబు పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:37 AM