
రాజమండ్రి: వస్తున్నా మీకోసం
కా ర్యక్రమంలో భాగంగా తమపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేస్తున్న
పాదయాత్ర ఏప్రిల్ 27 వరకూ కొనసాగి విశాఖపట్నంలో ముగుస్తుందని తెలుగుదేశం
పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.
శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడా రు. ఇప్పటివరకూ బాబు
ప్రతీరోజూ 11నుంచి 12 కిలోమీటర్ల వరకూ నడిచేవారని, కానీ అర్థరాత్రి
కావడంవల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందనే కారణ ంతో ఇక రోజుకు పదికిలోమీటర్లలోపే
నడిచేలా నిర్ణయించామన్నారు.
రూట్‌మ్యాప్‌లో మార్పేమీ లేదని,
రాత్రుల బస చేసే స్థలాలు మారతాయన్నారు.ప్రజల నుంచి కూడా మంచి స్పందన
వస్తుందన్నారు. రాజమండ్రిలో అపూ ర్వ స్పందన వచ్చిందన్నారు. పాదయ్రాతలో
వివిధ వర్గాల ప్రజలు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆయన
తెలిపారు.