February 6, 2013
పాదయాత్ర ప్రాంభం ఆదుర్స్

కృష్ణా జిల్లా పర్యటన
ముగించుకొని బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్
మీదుగా జిల్లాలోకి ప్రవేశించారు. ఆయనకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు
ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్, నరసరావుపేట
ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఇతర నాయకులు ఎదురెళ్లి ఘనంగా స్వాగతం
పలికారు. మేళతాళాలు, కనకతప్పెట్లతో ప్రకాశం బ్యారేజ్ పరిసరాలు హోరెత్తాయి.
మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ నేతృత్వంలో తెలుగు మహిళలు హారతి ఇచ్చి
చంద్రబాబును స్వాగతించారు. అక్కడి నుంచి చంద్రబాబు ఉండవల్లి సెంటర్‌కు
చేరుకొని బహిరంగ సభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు.
'నేను తాడేపల్లి
మండలం ఉండవల్లికి చేరుకొన్నప్పుడు ఇక్కడికి వచ్చిన అక్కలు, చెల్లెళ్లు,
అన్నలు, తమ్ముళ్లు, ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు
అభినందలం టూ..' చంద్రబాబు ప్రసంగం ప్రారంభించగానే ఉండవల్లి సెంటర్
హర్షధ్వానాలతో మారుమోగింది. పాదయాత్ర 127వ రో జు కృష్ణా జిల్లాలో పూర్తి
చేసుకొని గుం టూరులోకి వచ్చానని, ఇప్పటివరకు 11 జిల్లా పూర్తయి 12వ
జిల్లాలోకి ప్రవేశించిందన్నారు. మీ ఉత్సాహం నాలో ఉద్యమ స్ఫూర్తిని
నింపుతోందన్నారు.
గుంటూరు అనగానే...
గుంటూరు అనగానే నాకు
ఇక్కడి రాజకీయ చైతన్యం గుర్తుకొస్తుంది. ఎన్నో ఉద్యమాలు చేసిన గడ్డ ఇది.
మీరు చూపిస్తోన్న ఉత్సాహం పల్నాటి పౌరుషాన్ని ప్రదర్శిస్తోంది. వాణిజ్య
పంటలు, ఆదర్శరైతులకు నెలవైన ప్రదేశమిది. నాగార్జునసాగర్, అమరావతి ఇక్కడే
ఉన్నాయి. మీరు గోంగూర పచ్చడి బ్రహ్మాండంగా చేస్తారు. మీ అభిమానం
మరిచిపోలేనిదంటూ ఉండవల్లి సభకు హాజరైన ప్రజల్లో ఉత్సాహం నింపారు. కాళ్లు
నొప్పి పెడుతున్నా తాను ఒక ఆశయం కోసం వచ్చానని స్పష్టం చేశారు.
రాక్షస పాలన
రాష్ట్రంలో
గత తొమ్మిదేళ్లుగా రాక్షస పాలన, అవినీతి పాలన, దూరదృష్టి లేని పాలన, అసలు
పరిపాలన అంటే తెలియని పాలన జరగడం వలనే దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని
చంద్రబాబు అన్నారు. రైతులకు నీళ్లు లేవు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో
ప్రస్తుతం ఉన్న నీటి కంటే తక్కువ ఉన్న రోజుల్లో డెల్టా, సాగర్ కాల్వలకు
నీరు ఇచ్చిన ఘనత తనదన్నారు. 1994లో కరెంటు కష్టాలు ర్రాష్టాన్ని
చుట్టుముట్టగా పదేళ్ల పాటు సంస్కరణలు అమలు చేసి విద్యుత్ రంగాన్ని గాడిలో
పెట్టాం. మిగులు కరెంటు, బడ్జెట్ స్థితికి తీసుకొచ్చి వ్యవసాయానికి
విద్యుత్ అందించామన్నారు. అలాంటిది నేడు కరెంటు లేదు. విద్యుత్ బిల్లులు
ప్రజలు గుండెలు ఆగేలా చేస్తున్నాయి. కాంగ్రెస్ అవినీతి, దోపిడి వలనే
విద్యుత్ చార్జీలు పెరిగాయి. దేశంలో దొంగలు పడ్డారు. మహాగజనీల్లా
దోచుకొన్నారని ధ్వజమెత్తారు.
మహిళలకు ఎన్నో చేశా
మహిళల కోసం
నాడు పొదుపు సంఘాలు ఏర్పాటు చేయించి రివాల్వింగ్ ఫండ్ ఇప్పించాను.
విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశాం. ఉద్యోగాల్లో 33 శాతం
రిజర్వేషన్ కల్పించాం. 35 లక్షల వంట గ్యాస్ సిలిండర్లను స్టౌలతో సహా రూ.
200 చొప్పున కడితే ఇప్పించాను. తొమ్మిదేళ్ల పాటు గ్యాస్ ధర పెరగలేదు.
పెరగనీయలేదు. ఈ రోజు రూ. 475 చేశారు. తొలుత రూ. 1175 పెట్టి సిలిండర్ కొటే ఆ
తర్వాత ఎప్పటికో ఆధార్ చూసి సబ్సిడీ మొత్తం వాపసు చేస్తారట. కొత్త గ్యాస్
కనెక్షన్ రూ. ఏడు వేలు దాటింది. ఈ పరిస్థితుల్లో ఏడాదికి 10 సిలిండర్లు
ఇప్పించే బాధ్యత తాను తీసుకొంటానని చంద్రబాబు హామి ఇచ్చారు.
ఏమి తినేట్లు... ఏమి కొనేట్టు
సన్నబియ్యం
నాడు రూ.14 ఉంటే నేడు రూ. 50కి చేరాయి. చక్కెర రూ. 13 నుంచిర రూ.46,
కందిపప్పు రూ.20 నుంచి రూ.80, మరోవైపు వంట గ్యాస్ తో ఎవరూ వంట చేసే
పరిస్థితి లేకుండా కాంగ్రెస్‌పార్టీ చేసిందన్నారు. సభకు హాజరైన ప్రజలను
ఉద్దేశించి ఏమి తమ్ముళ్లు మీ ఇంట్లో మీకు వంటచేసి పె డుతున్నారా అంటూ
ప్రశ్నించారు. నాడు జేబులో డబ్బులు తీసుకెళితే సంచితో స రుకులు తెచ్చుకొనే
పరిస్థితి, నేడు సం చితో డబ్బులు తీసుకెళితే జేబు నిండా స రుకులు రాని
దుస్థితి అంటూ బేరీజు వేసి చెబుతూ ప్రసంగం కొనసాగించారు. ఆర్‌టీసీ, ఆటో
చార్జీలు పెరిగిపోయాయని, పెట్రోల్, డీజిల్ రేట్లను 29 సార్లు పెంచారు. ఇంకా
సిగ్గు లేకుండా ప్రతి నెలా డీజిల్ ధర పెంచుతామని చెబుతున్నారని కేంద్రంపై
మండిపడ్డారు. ఇది బాదుడు ప్రభుత్వమని, ప్రజలు చైతన్యవంతులు కాకపోతే
బతకనీయరన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడమే
ప్రజల ముందున్న మార్గమని సూచించారు.
Posted by
arjun
at
9:30 PM