February 6, 2013
జంట నగరాలుగా గుంటూరు -విజయవాడ

ఎంఎస్ఎస్‌ను గుర్తు పెట్టుకోవాలి
తెలుగుదేశం పార్టీ మంగళగిరి ప్రాంత దివంగత నాయకుడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావును అందరూ జ్ఞాప కం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తన సేవా కార్యక్రమాల ద్వా రా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారనని కీర్తించారు. ఆయన తనయుడు మాదల రాజేంద్ర ఆరో గ్యం బాగోలేకపోవడం వలన పాదయాత్రకు హాజరు కాలేకపోతున్నారని, త్వరగా కోలుకొని ప్రజాసేవకు అంకి తం కావాలని ఆకాంక్షించారు.
కోడెల, యరపతినేనిపై
తప్పుడు కేసులు
సహకార ఎన్నికల్లో అక్రమాలను ప్రశ్నించేందుకు వెళ్లిన మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసు బనాయిం చి జైలుకు పంపిందన్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కూడా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దొంగలను కాపాడుతూ ప్రజల కోసం పోరాటం చేస్తున్న తమ పార్టీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహించారు.
ఆట్రోడైవర్‌లా చైతన్యవంతులు కండి
'నేను విజయవాడ పర్యటనలో ఉన్న సమయంలో ఓ ఆట్రోడైవర్ వచ్చి ఆవేశంగా ప్రసంగించారు. జగన్ పార్టీ వాళ్లు ఆ యన్ని సంతకం చేయాలని అడిగారట. అందుకు ఆ ఆట్రోడైవర్ దేని కోసం సం తకం చేయాలని ప్రశ్నించగా జగన్ విడుదల కోసమని ఆ పార్టీ వాళ్లు చెప్పారట. దాంతో ఆ ఆట్రోడైవర్ రూ. లక్ష కోట్లు దోచుకొన్న వ్యక్తి జైలు నుంచి విడుదల కావాలని నేను సంతకం పెట్టాలా? పెట్టను పోం డి అని ఎదురుతిరిగాడు. ఆ ఆట్రోడైవర్‌ను వైసీపీ నాయకులు హెచ్చరించినా మీకు చేతనైంది చేసుకోండి పోండి అని నిజాయితీ పక్షాన నిలబడ్డాడు. ఆ ఆట్రోడైవర్‌కు ఉన్న చైతన్యంలో 10 శాతం కమిట్‌మెంట్ వైఎస్ కు ఉంటే ర్రాష్టానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
Posted by
arjun
at
9:33 PM