February 6, 2013
మునిగేది మోసం.. మిగిలేది ముంచే!
ఎన్ని వాగ్దానాలు.. ఎన్నెన్ని హామీలు. కృష్ణమ్మకు రిటైనింగ్ వాల్ కడతామని ఎంత నమ్మబలికారు? దానివల్ల వరద ప్రమాదాన్ని నివారించొచ్చునని చెబితే ఈ జనం నమ్మారు. బతుకును సురక్షితం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పిన వాళ్లంతా ఇప్పుడు గాలికి వదిలేశారు. పన్నులు కట్టించుకునేప్పుడు, సర్‌చార్జీలు మోపేటప్పుడు తప్ప వీరికి పౌర ఉనికే లేదు. విజయవాడలోకి వచ్చి నాలుగు రోజులు. ఈ కాలమంతా ఇలాంటి వాళ్లే ఎదురయ్యారు. నా వెంట నడిచారు. చేతులు పట్టుకొని వెతలు వెళ్లబోసుకున్నారు.
నన్ను తమ తోబుట్టువులా ఆదరించారు. నగరంలోకి వచ్చినప్పటి నుంచి వీడిపోయే క్షణం వరకు ఈ జనం కనబరిచిన స్పందన అనేకసార్లు ఉద్వేగానికి గురిచేసింది. ఇదివరకు నేను అనేకసార్లు విజయవాడలో పర్యటించాను. కానీ, ఇలాంటి అభిమానం చవిచూడలేదు. ఆడపడుచు కంట్లో కసిని, కుతకుత ఉడుకుతున్న పేదోడి గుండెమంటని దగ్గరగా చూశాను. ఎప్పటికైనా ఈ కృష్ణలో మునిగేది మోసం.. పైకి లేచేది మంచితనమే!
Posted by
arjun
at
5:14 AM