February 4, 2013
కార్పొరేషన్‌ను దోచేశారు

స్థానిక దుర్గా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారుల నుంచి అధిక వడ్డీలను వసూలు చేస్తోందన్నారు. రూ.50 వేల రుణం తీసుకుంటే లబ్ధిదారుడు రూ.2 లక్షల వరకు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్‌ను మార్పు చేశారని దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన నాయకులు వారి ఆస్తులను దోచుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు, వితంతువులకు రూ.600ల చొప్పున పింఛన్ ఇస్తామన్నారు.
సీల్డ్ కవర్ల సీఎం కిరణ్ ఢిల్లీలో పైరవీలు చేసుకోవడంతోనే సమయాన్నంత వెచ్చించిస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు.నకిలీ బదిలీ పథకం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం నకిలీదని చంద్రబాబు వ్యగంస్త్రాలు సంధించారు. ఈ పథకం ద్వారా ప్రజల్లో ఆర్థిక అసమానతలు తొలగించాల్సిందిపోయి వాటిని పెంచుతున్నాయన్నారు. ఈ పథకం ద్వారా తక్కువ ధరకు నిత్యావసరాలను అందించాల్సిపోయి ప్రజలను మార్కెట్‌లకు వెళ్లి అధిక ధరలకు నిత్యావసరాలను కొనుగోలు చేసుకునేలా చేస్తోందన్నారు.
కాంగ్రెస్‌వారికే 'గృహకల్ప' రాజీవ్ గృహకల్ప పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లు పూర్తిగా నాసిరకంగా ఉంటున్నాయన్నారు. నిజమైనా పేదలు స్థానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఇళ్లల్లో తిష్ఠవేస్తున్నారని దీంతో ఇది కాంగ్రెస్ గృహకల్పగా మారిందన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు తమ పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే విధంగా ఆ పార్టీ నాయకులు వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.
Posted by
arjun
at
7:05 AM