February 4, 2013
ప్రపంచ పటంలో విజయవాడకు గుర్తింపు తెస్తా

యువతకు ఉద్యోగాలు కావాలంటే తెలుగుదేశంనే గెలిపించాలన్నారు. ప్రజలంటే ప్రభుత్వానికి భయం లేకుండాపోయిందని, తమ ఓటు హక్కు ద్వారా ప్రజలు ప్రభుత్వంపై తిరగబడి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం హయాంలోనే మహిళలకు రక్షణ ఉందని చెప్పారు. విజయవాడలో 2010లో జరిగిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసు మూడేళ్లయినా అతీగతీ లేకపోవడాన్ని ప్రస్తావించారు. యువత ఫేస్‌బుక్, ఎస్ఎంఎస్‌ల ద్వారా అవినీతిపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఉల్లిధరలు పెరిగి వాటిని నియంత్రించలేక గతంలో రెండు, మూడు ప్రభుత్వాలే కుప్పకూలాయని, ఆ పరిస్థితి పునరావృతం కానున్నదన్నారు. మొగల్రాజపురంలో దొంగల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ఈ ప్రభుత్వమే పెద్ద దొంగల పార్టీగా మారిందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
ఉద్యోగులకు అండగా టీడీపీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగులకు అండగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. పీఆర్‌సీ ప్రకారం జీతభత్యాలు చెల్లించే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను తీర్చేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.
Posted by
arjun
at
9:35 PM