February 4, 2013
సర్కారు రోగానికి మందేస్తేనే..

కాకపోతే, వాళ్ల ఆవేదన తీరేదాకా, వాళ్ల దిగులు గుండెల బరువు తగ్గేదాకా మా ట్లాడ లేకపోతున్నాననేదే బాధ. వాళ్లతో ఆటలాడి, కష్టాలు అడిగి తెలుసుకుందామని పదేపదే ప్రయ త్నించినా నా వల్ల కాలేదు.ఐదు నిమిషాలైనా వాళ్లతో మాట్లాడలేకపోయాను. ఇటీ వలి కాలంలో గొంతు అస్సలు సహకరించడం లేదు. వాళ్ల మూగబాధను మూగగానే వినాల్సి వస్తోంది. నగరంలో కొండ బతుకు. ఎంత విచిత్రం: ఎప్పుడు ఏ బండ పైన పడుతుందో.. గుప్పెడు ప్రాణాన్ని ఎప్పుడు ఏ విష పురుగు కాటేస్తుందో తెలియదు. ఆ నున్నటి రాళ్లపై నడక చావుతో సమానం. వీళ్లంతా కడుపేదలు. పారిశుద్ధ్య లోపాల వల్ల నిత్యం రోగాల బారిన పడుతున్నారట. పేరుకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.
కానీ, అక్కడ సూది, దూది నుంచి ధర్మామీటరు, జ్వరం బిళ్ల దాకా ఏ కనీస వైద్యమూ వాళ్లకు అందడం లేదట. లక్ష కోట్ల బడ్జెట్, అందులోనూ వైద్యశాఖకు వేల కోట్ల కేటాయింపులు ఎక్కడ? పేదల పట్ల ఇంత పరిహాసమా? ఆరోగ్యశ్రీ అంటూ జబ్బలు చరుసుకుంటున్నారుగానీ, వీళ్లలో 76 శాతం వైద్యానికే నోచు కోవడం లేదు. చివరకు ఆరోగ్యశ్రీని కార్పొరేట్ ఆస్పత్రుల సిరుల తరువుగా మార్చివేసిన వైనం నా ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది. ఈ సర్కారు రోగానికి మందు వేస్తేగానీ సర్కారు దవాఖానాలు దారికి రావు!
Posted by
arjun
at
9:31 PM