వస్తున్నా మీకోసం యాత్రకు జిల్లాలో ఉన్న యువత నుంచి భారీగా
స్పందన వస్తోంది. బాబు ఏ గ్రామం వెళ్లినా యువతీయువకులు ముందుకు వచ్చి బాబుతో కరచాలనం
చేసేందుకు పోటీపడుతున్నారు. యువ త పాదయాత్రలో పాల్గొంటుంటే బాబు రెట్టించిన ఉత్సాహంతో
ముందుకు సా గుతున్నారు. పెద్దతండా గ్రామంలో బా బు పాదయాత్రకు తరలివచ్చిన యువతను చూసి
బాబు యువత అవినీతిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. '150 సంవత్సరాలైనా వివేకానందుడిని
మనం మరిచిపోలేకపోతున్నామంటే ఆ యన రగల్చిన స్ఫూర్తి కారణమన్నారు. వివేకానందుడిని ఆదర్శంగా
తీ సుకుని'' యువత ముందుకు సాగాలన్నారు. అ లాగే భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చాలంటే
యువత ముం దు టకు రావాలని పిలుపునిచ్చారు. యువత ప్రతక్ష్య రాజకీయాల్లో కి రావాలని సూచించారు.