January 14, 2013
మా ఇంటిని మరిపించారు

'బాబు' గారికి దండం పెట్టు బసవన్నల నాట్యానికి ముగ్ధుడైన చంద్రబాబు 'బాబు
గారికి దండం పెట్టు. అయ్య గారికి సలాం కొట్టు.. అంటూ గంగిరెద్దుల వారు చేయించిన బసవన్నల
విన్యాసాలకు టీడీపీ అధినేత ఆనందపరవశుడయ్యారు. చిన్నప్పుడు పల్లెల్లో చూసిన సంప్రదాయం
సంస్కతి ఒక్కసారిగా కళ్ల ముందు సాక్షాత్కరించటంతో ఆయన జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
గంగిరెద్దుల విన్యాసాలను బాబు తిలకించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రవెంకటవీరయ్య ఈ
గంగిరెద్దులను తెప్పించారు. హరిదాసు ఆలపించిన కీర్తనలు సంక్రాం తి వేడుకలో ప్రత్యేక
అకర్షణగా నిలిచిం ది.
సంప్రదాయాన్ని బతికిస్తున్న కళాకారులకు చంద్రబాబు కొంత అర్థిక స హాయం అందించారు.
ఈ సం క్రాంతి వే డుకల్లో ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు,
సండ్ర వెంకటవీరయ్య, ఊకే అబ్బయ్య, ఎంపీ నామ నాగేశ్వరరావు ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ,
పొట్ల నాగేశ్వరరావు, తెలుగు మహిళా నేతలు స్వర్ణకుమారి, రాయల లత, కొత్తపల్లి నీరజ, ఫణీశ్వరమ్మ
తదితరులు పాల్గొన్నారు. స ంక్రాంతిని పురస్కరించుకోని పలువు రు పుష్పగుచ్ఛాలు అందజేసి
శుభాకాంక్ష లు తెలిపారు.
Posted by
arjun
at
5:55 AM