April 6, 2019





https://www.youtube.com/channel/UCJKI_07UStnvX2ty6wFbKiA?sub_confirmation=1

December 19, 2017




కర్నూల్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల ఫేస్ బుక్ పేజిలు

May 20, 2014

Erratic power supply and untimely rains delivered deadly blows on the cash crops and horticultural crops, crippling the farmers financially. Loan waiver will reduce the burden on the farmers and bring them back on the path of prosperity.

Promises that rebuild lives

న్యూఢిల్లీ, మే 20 : దేశంలో కొత్తశకం ప్రారంభమైందని, దేశానికి ఈరోజు శుభదినమని, నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం దేశానికి శుభశూచకమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి ఢిల్లీలో ఏపీ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుపరిపాలన కోసం దేశం ఎదురుచూస్తోందని అన్నారు. భారీ మెజార్టీతో మోదీ గెలుస్తారని ముందే చెప్పానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. నరేంద్రమోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం తనకు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
యూపీఏ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. యూపీయే పదేళ్ల పరిపాలనలో అవినీతి పెరిగిందని, యూపీఏపై కోపంతో ప్రజలు ఎన్డీయేకు పట్టం కట్టారని ఆయన అన్నారు. రెండు సార్లు కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నామని ఆయన అన్నారు. ఎన్డీయేలో చేరుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
సామాజిక తెలంగాణ టీడీపీ లక్ష్యమని, అందుకు సహకరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్డీయే హయంలో రెండు ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, హైదరాబాద్‌లోని తెలుగువారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అందరి సహకారం కావాలని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని నరేంద్రమోదీ ముందే చెప్పారని చంద్రబాబు తెలిపారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
ఆం«ధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని, అన్నీ పట్టణాలను అభివృద్ధి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలకు అండగా ఉంటామని నేను, మోదీ హామీ ఇచ్చామని, ఈ హామీల అమలుకు కృషి చేస్తానని ఆయన వాగ్ధానం చేశారు. విభజనతో రాష్ట్రాన్ని పెనం నుంచి పొయ్యిలో పడేశారని కాంగ్రెస్‌నను బాబు దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనలో హేతుబద్దత లేదని ప్రశ్నిస్తే... తనవి రెండు కళ్ల సిద్ధాంతమని కొందరు ఎగతాళి చేశారని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడనేది నిర్ణయిం
చకుండా ఎలా విభజన చేస్తారని చంద్రబాబు కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అవినీతి రహిత దేశం కోసం కృషి చేస్తామని, వ్యక్తులను కాదు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రమాణస్వీకారం చేస్తానని, ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తానని ఆయన అన్నారు. పరిపాలన ఏపీ నుంచే మొదలు పెడతానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఎన్డీయే ప్రభుత్వంలో చేరుతున్నాం : బాబు

గవర్నర్‌ని కలవటానికి చంద్రబాబు వెళ్ళినప్పుడు, ఆయనతో కలసి వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యేలకి ‘‘మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బాగా కష్టపడి పని చేస్తారు, ఆయనలాగా మీరు కూడా కష్టపడాలి’’ అని టిడిపి ఎమ్మెల్యే, ఎంపీలకు గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. మీరు చేతులు కలపాలని, జట్టుగా ఆయనకు సహకరించాలని సూచించారు.

ఆయనలాగా మీరు కూడా కష్టపడాలి... -నరసింహన్






slide

December 6, 2013

అడ్డగోలుగా రాష్ట్ర విభజనకు పాల్పడుతున్న కేంద్రం గద్దెదిగి రావాలంటే ఆందోళనలు తప్పవని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. తాము ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా అని వారు ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల జేఏసీలను సంప్రదించాలన్న తమ డిమాండ్‌ను నెరవేర్చలేదన్నారు. సమస్యలుపరిష్కరించకుండా విభజన నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారని వారు ప్రశ్నించారు. కేంద్ర ఏకపక్షనిర్ణయాన్ని, జాతీయ పార్టీలు వ్యతిరేకించాలని వారు డిమాండ్‌ చేశారు. మీడియా సమావేశంలో ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొనకళ్లనారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌లు పాల్గొన్నారు.

కేంద్రం దిగిరావాలంటే ఆందోళనలు తప్పవు

December 5, 2013


 రాయల తెలంగాణ ప్రతిపాదనపై కేబినెట్ నోట్ చూశాకే తాము స్పందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలోనే చూస్తోందని, తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా అని కాంగ్రెస్ బేరీజు వేసుకుంటోందని ఆరోపించారు.

తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా

కృష్ణ జిలాలపై బ్రెజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వానికి అవగాహన లేదని, అందుకే రాష్టానికి నష్టం జరుగుతున్న ఇంతవరకు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి కోలుకోలేనటువంటి నష్టం వస్తుందని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని, తీర్పును రద్దు చేసే విధంగా పోరాడాలని మండవ కోరారు. అలాగే దీనిపై అఖిల పక్షం కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా మైనపు బొమ్మలా ఉండకుండా స్పందించి, రాష్ట్రానికి న్యాయం చేయాలని మండవ పేర్కొన్నారు. తీవ్ర నష్టానికి కారకుడు దివంగత మాజీ సీఎం వైఎస్ అయితే, జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తప్పు పట్టడం సరికాదని ఆయన హితవుపలికారు.

తీవ్ర నష్టానికి కారకుడు దివంగత మాజీ సీఎం వైఎస్

 రాయల తెలంగాణ ఎవరు అడిగారని, రాయలసీమను విభజిస్తే అనేక సమస్యలు వస్తాయని తెలుగుదేశం పార్టీ ఎంపీలు శివప్రసాద్,
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదన కాంగ్రెస్ నిర్ణయమని, ఎవరూ కోరలేదని అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తెరపైకి తీసుకు వచ్చిందని ఆయన అన్నారు.

మరో ఎంపీ మోదుగుల మాట్లాడుతూ తెలుగు ప్రజల సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆయన ఓ మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే అని ఆయన పేర్కొన్నారు.

మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే

December 4, 2013

జూరాల వద్ద తెలుగుదేశం పార్టీ రేపు తలపెట్టిన మహాధర్నా కార్యక్రమం వాయిదా పడినట్టు సమాచారం.

జూరాల వద్ద టీడీపీ మహాధర్నా వాయిదా

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దొంగనాటకాలు ఆడుతున్నాయని, ఈ రెండు పార్టీలు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బేరం కుదరక పోవడంవల్లే విభజన నాటకాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు.

తెలంగాణ జిల్లాల్లో గురువారం కేసీఆర్ పిలుపిచ్చిన బంద్‌కు సహకరించవద్దని మోత్కుపల్లి కోరారు. కేసీఆర్ టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయనని చెప్పడం వల్లే రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు వచ్చిందని, తెలంగాణ బిల్లు రాకుండా కేసీఆరే అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకు తెచ్చించో ప్రజలు గమనిస్తున్నారని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తన దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తుందని కెసిఆర్ విభజనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటిస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతామని చెప్పిన కెసిఆర్, ఇప్పుడు మాటమార్చి నాటకాలాడుతున్నారని అన్నారు.

డబ్బు సంచులు, ప్యాకేజీలు ఇక రావనే ఉద్దేశంతోనే విభజనను అడ్డుకునేందుకు కెసిఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీతో కెసిఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మ బలిదానం చేసుకుంటే.. కెసిఆర్ కోట్ల కోసం ఆశపడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

బేరం కుదరక పోవడంవల్లే విభజన నాటకాలు ఆడుతున్నారు.

గతంలో ఆల్మట్టి ఎత్తు పెంచడానికి ప్రయత్నిస్తే అప్పటి ప్రధాని దేవెగౌడతో పోరాడా. ఆల్మట్టి ఎత్తు పెంచడానికి వీల్లేదని 4 రాష్ట్రాల సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చింది. టీడీపీ హయాంలో రూ. 11 వేల కోట్లు ఖర్చు పెట్టి 30 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తీసుకొచ్చాం. నాణ్యమైన ప్రాజెక్టులను నిర్మించి నీళ్లిచ్చిన ఘనత టీడీపీదే’ అని బాబు అన్నారు.

ఆల్మట్టి ఎత్తు పై ప్రధాని దేవెగౌడతో పోరాడా!

 కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల 14 జిల్లాల్లో తాగు,సాగు నీటి సమస్యలు తలెత్తుతాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ వద్ద చేపట్టిన మహాధర్నాలో బాబు మాట్లాడుతూ తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ తీర్పు వల్ల మన హక్కులను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కరువులు, వరదల సమయంలో ఇబ్బందులు పడుతున్నది మనమే అని, కృష్ణానదికి తెలుగు ప్రజలకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. కృష్ణా నదిపై ఇప్పటి వరకు రెండు ట్రిబ్యునళ్లు వేశారని తెలిపారు. దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా బ్రిజేష్‌కుమార్ జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. 78 సంవత్సరాల డేటా 75 శాతం నీటి లభ్యతతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేస్తే....బ్రిజేష్ ట్రిబ్యునల్ 47 ఏళ్ల డేటా 65 శాతం నీటి లభ్యతను పరిశీలించి కేటాయింపులు చేయడం సరికాదన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా

కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పుకు వ్యతిరేకంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద చేపట్టిన మహాధర్నాలో టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు, రైతులు అధిక సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.

టీడీపీ మహాధర్నా

November 27, 2013


 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులపంట రుణాలను మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంతో పాటు వివిధ చోట్ల హెలెన్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తుపాన్‌ వస్తే ప్రభుత్వం కనీసం సహాయ చర్యలు కూడా చేపట్ట లేదని ఆవేదన వ్యక్తం చేవారు. డెల్టా ఆధునీకరణ పనుల్లో రూ. కోట్ల దోపడీ జరిగిందని, అందుకే రైతులు పంటలను నష్టపోతున్నారని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బాధితుల గోడు పట్టదని విమర్శించారు. ఏ పనిచేసినా రాజకీయ కోణంలో చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తుపాన్‌ను కూడా పట్టించుకోవడం లేదని, ఆ పార్టీ నేతలు అంతఃకలహాలతోనే మునిగి తేలు తున్నారని ఆరోపించారు.

రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ ఇంచార్జిలు ప్రజలతో మమేకం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. పార్టీ విధానాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అం దించాలని కోరారు. చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చె ందిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల కడగండ్లు తీరుస్తానని నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అంతర్వేదిలో లక్ష్మిననసింహ స్వామి వారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు చిక్కాల రామచంద్రరావు, యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గొల్లపల్లి సూర్యారావు, నిమ్మకాయల చినరాజప్ప, యర్రా నారాయణ స్వామితో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీల ఇం చార్జిలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అధికారంలోి రాగానే పంట రుణాలు మాఫీ చేస్తాం

తెలుగుదేశం ప్రభంజనాన్ని ఆపలేమని భావించి, ఆ భయంతోనే విభజన పేరుతో ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీ కొత్త వాదం ప్రవేశపెట్టారని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు.ఆమె అతి తెలివి ఫలించదని అన్నారు. అంతేకాక రాష్ట్రంలో సోనియాకు ముఖం చెల్లడంలేదు. అందుకే ఇక్కడకు రావడంలేదు. జగన్ ముసుగులో వస్తున్నది. ఈ ముసుగు తీసి చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఓటేస్తే సోనియాగాందీకి ఓటు వేసినట్లేనని ఆయన హెచ్చరించారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఓటేస్తే సోనియాగాందీకి ఓటు వేసినట్లే...........

November 18, 2013

ఎన్టీఆర్ పరిచయం అవసరం లేని పేరు. రాముడు,కృష్ణుడు లాంటి దేవుళ్ళు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇలాగే ఉంటారేమో నని ఆయన రూపం తెలిపింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతను ఓ సంచలనం. భారత చలన చిత్ర చరిత్రలో సంచలనం. ఆ నటుడు వేయని పాత్ర లేదు. అజరామరమైన చిత్ర రాజాలను ఎన్నింటినో అందించారు. స్టూడియో అధినేతగా, నిర్మాతగా ,దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా సంచలనాలను సృష్టించాడు ఎన్టీఆర్. రాష్ట్రంలో వేళ్ళూనుకు పోయిన కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బ తీసాడు. తెలుగుదేశం పార్టీ ని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టి వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు ల్లోకి ఎక్కాడు. దట్ ఈస్ ఎన్టీఆర్. అంతేకాదు లోక్ సభ లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా టి డి పి ని నిలబెట్టారు ఎన్టీఆర్. భారత దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది ఒక్క ఎన్టీఆర్ వల్లే సాధ్య మైంది. రాష్ట్రంలో పెను మార్పులు రాజకీయ రంగంలో వచ్చాయంటే అది కేవలం ఎన్టీఆర్ వల్లే. పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజలకు దగ్గరయ్యారు. జాతీయ స్థాయిలో పలు పార్టీ లను ఒకే వేదిక పైకి తీసుకు వచ్చి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసారు. తెలుగు వాడి సత్తా ఏంటో ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్. అనితర సాధ్యమైన విజయాలెన్నింటినో అలవోకగా అందుకున్న కారణజన్ముడు ఎన్టీఆర్. సినిమా రంగంలో, రాజకీయ రంగం లో సంచలనాలను సృష్టించిన ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డ్ ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ ఇప్పటివరకు ఆ విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది. రాజకీయ కారణాల వల్లే ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వలేదు. భారత రత్నకు నూటికి నూరు పాల్లు అర్హుడు ఎన్టీఆర్. ఇకనైనా ఆ మహనీయుడిని గౌరవించుకుందాం.

ఎన్టీఆర్ కు భారత రత్న ఎప్పుడు..?

November 17, 2013

తెలుగుదేశం పార్టీ కూడా హైదరాబాద్ లో బహిరంగ సభ జరుపుతోంది. ఆత్మగౌరవ యాత్ర ను ప్రారంబిద్దామని ఆలోచించిన టిడిపి ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చుకుని బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల ఇరవైఆరున హైదరాబాద్ లో కూడా సభ ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఈనెల 21న తిరుపతి, 22న నెల్లూరు, 23న ఒంగోలు, 24న గుంటూరు, 25న కృష్ణా జిల్లా, 26న హైదరాబాద్‌లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే గాలిముద్దుకృష్ణమనాయుడు తెలియచేశారు.

హైదరాబాద్ లో టిడిపి బహిరంగ సభ!

విభజనకు కారకులైన కాంగ్రెస్ పార్టీ, దాంతో ఒప్పందం చేసుకున్న వైసిపిలను సీమాంధ్ర నుంచి తరిమికొట్టాలని టిడిపి ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. వైసిపి అండతోనే రాష్ట్రవిభజన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందని ఆరోపించారు. వైసిపికి ఓటు వేసినా కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లేనని ఆయనవ్యాక్యానించారు.

వైసిపికి ఓటు వేసినా కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే