September 9, 2013
టీఆర్ఎస్‌కు రాష్ట్ర విభజన ఇష్టం లేదు : సోమిరెడ్డి
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శివసేనా పార్టీలా టీఆర్ఎస్ వసూలు పార్టీయని ఆయన ఎద్దేవా చేశారు. సీమాంధ్రకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలను టీడీపీ ద్వేషించడంలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను కేంద్రం ఏక పక్షంగా చేయాలనుకేంటే ఊరుకునేది లేదని, జేజమ్మకాదు, బ్రహ్మదేవుడు దిగిరావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం చేసుకుంది కాబట్టే ఆ పార్టీని విమర్శించడంలేదని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ నుంచి సలహాలు తీసుకునే స్థితిలో టీడీపీ లేదని ఆయన వెల్లడించారు.
Posted by
arjun
at
8:14 AM