రాజకీయాల్లో ఒకస్థాయి గల నేత అయిన టీడీపీ
అధినేత చంద్రబాబును అవమానపర్చేవిధంగా ఎవరూ మాట్లాడినా సరికాదని పీసీసీ
అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. గురువారం అసెంబ్లీలోని తన
చాంబర్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చంద్రబాబు కాంగ్రెస్
పార్టీకి మేనమామ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ
దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై బొత్స పైవిధంగా స్పందించారు. ఒక పార్టీ
నేతను కలిసినప్పుడు, మాట్లాడిన ప్రతి అంశాన్ని మీడియాకు చెప్పి పల్చన
కావద్దని జేసీకి హితవు పలికారు.