June 13, 2013
స్పీకర్‌కు టిడిపి ‘అభిశంసన లేఖ’

స్పీకర్ తీరును విమర్శిస్తూ టిడిపి శాసన సభాపక్షం
స్పీకర్‌కు లేఖ రాసింది. టిడిపి శాసన సభాపక్షం నాయకుడు చంద్రబాబునాయుడు,
గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే రమణ ఈ లేఖపై
సంతకాలు చేశారు. విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై తాము ఫిర్యాదు చేసినా
వెంటనే చర్య తీసుకోలేదని గుర్తు చేశారు. సభలో మాట్లాడేందుకు సమయం
కేటాయించడంలో టిడిపి పట్ల వివక్ష చూపుతున్నారు. సభలో టిడిపి తరఫున ఎవరు
మాట్లాడాలో స్పీకర్ నిర్ణయిస్తున్నారని విమర్శించారు. వివిధ సభా కమిటీల్లో
సభ్యుల నియామకంలో సైతం ఇదే విధంగా జరుగుతోందని తెలిపారు. టిడిపి సభ్యులు
మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ ఉద్దేశ పూర్వకంగా మధ్యలో జోక్యం
చేసుకుంటున్నారని తెలిపారు.
స్పీకర్ తీరును విమర్శిస్తూ టిడిపి శాసన సభాపక్షం స్పీకర్‌కు లేఖ రాసింది. టిడిపి శాసన సభాపక్షం నాయకుడు చంద్రబాబునాయుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే రమణ ఈ లేఖపై సంతకాలు చేశారు. విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై తాము ఫిర్యాదు చేసినా వెంటనే చర్య తీసుకోలేదని గుర్తు చేశారు. సభలో మాట్లాడేందుకు సమయం కేటాయించడంలో టిడిపి పట్ల వివక్ష చూపుతున్నారు. సభలో టిడిపి తరఫున ఎవరు మాట్లాడాలో స్పీకర్ నిర్ణయిస్తున్నారని విమర్శించారు. వివిధ సభా కమిటీల్లో సభ్యుల నియామకంలో సైతం ఇదే విధంగా జరుగుతోందని తెలిపారు. టిడిపి సభ్యులు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ ఉద్దేశ పూర్వకంగా మధ్యలో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు.
Posted by
arjun
at
11:11 PM