June 17, 2013
టిఆర్ఎస్ డ్రామా కంపెనీగా మారింది:ఎర్రెబల్లి
తెలంగాణ రాష్ట్ర సమితి డ్రామా కంపెనీగా తయారైందని టిడిపి సీనియర్
ఎమ్మెల్యే ఎర్రెబల్లి దయాకరరావు ధ్వజమెత్తారు.ఆ పార్టీకి తెలంగాణ రావాలని
లేదని, నిజంగా ఆ చిత్తశుద్ది ఉంటే ఆ పార్టీ అదినేత కెసిఆర్ ఫామ్ హౌస్ లో
పడుకుంటారా అని ప్రశ్నించారు. కెసిఆర్ వెళ్లి పార్లమెంటులో ఎందుకు ధర్నా
చేయరని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ కూడా టిఆర్ఎస్ డ్రామాకు
పరోక్షంగా సహకరిస్తున్నదని, తెలంగాణ రాకుండా ఎవరు అడ్డుపడుతున్నది
చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణపై స్పష్టంగానే
ఉన్నా,లేనిపోని విమర్శలు చేస్తున్నారని,ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ
సమస్య పరిష్కారానికి ఎందుకు చొరవ చూపరని ఆయన
ప్రశ్నించారు.కాంగ్రెస్,టిఆర్ఎస్ కుమ్మక్కైనందువల్లనే సభ జరగడం లేదని ఆయన ఆరోపించారు.
Posted by
arjun
at
7:54 AM