May 25, 2013
ఐఏఎస్‌లా? దొంగలా? : పయ్యావుల
కొద్ది సేపటి తర్వాత అధికారులు సమావేశం ముగించుకుని వెళ్లిపోవడంతో, అటెండర్ వచ్చి అధికారులు అందరూ వెళ్లిపోయారని అనడంతో కేశవ్ ఫైర్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఐఏఎస్‌లు ప్రజా ప్రతినిధులొస్తే దొంగల్లా పారిపోతారా? అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయంపై సభాపతికి ఫిర్యాదు చేస్తానన్నారు.
ఛార్జీలు పెంచమని ప్రభుత్వం ఆదేశాలిస్తే అమలు చేసే ఈ అధికారులు ఐదు గంటలు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని ఇచ్చిన సర్క్యులర్‌ను ఎందుకు అమలు చేయరని నిలదీశారు. రెండు రోజుల్లోగా ఆ సర్క్యులర్ అమలు చేయకపోతే ప్రజల నుంచి మిస్‌డ్ కాల్స్ రూపంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆ ఇద్దరు అధికారులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు.
Posted by
arjun
at
7:12 PM