April 5, 2013
జగన్ రాజ ప్రాసాదాల్లో దెయ్యాలు: ముద్దు
హైదరాబాద్ : "జగన్ వేల కోట్ల రూపాయలు సంపాదించి రాజ ప్రాసాదాలు
కట్టుకొన్నారు. బెంగళూరులో ఏకంగా 35 ఎకరాల్లో భవనం కట్టుకొన్నారు.
హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో లక్షా ఇరవై వేల చదరపు అడుగుల మహా భవంతి
నిర్మించారు. ఇప్పుడు వాటిలో ఉండేవారు లేక దెయ్యాలు కాపురం ఉంటున్నాయి.
జగన్ జైల్లో ఉంటే షర్మిల రోడ్లపై తిరుగుతున్నారు. విజయలక్ష్మి దీక్షల్లో
కాలం గడుపుతున్నారు'' అని తెలుగుదేశం శాసనసభాపక్ష ఉప నేత ముద్దు కృష్ణమ
నాయుడు వ్యాఖ్యానించారు.
గురువారం ఆయ న టీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కోట్లు సంపాదించినా జగన్‌కు చివరకు జైలు కాపురమే మిగిలిందని... వైఎస్ హయాంలో రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొన్న 22 వేల మంది రైతులు, 5వేల మంది చేనేత కార్మికుల ఆత్మలు జగన్ కట్టుకొన్న ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొన్నారు.
Posted by
arjun
at
2:54 AM