April 5, 2013
గతిలేకే ఎన్టీఆర్ ఫోటోలు
వైసీపీకి ఇడీ అమీన్, ముషారఫ్
ఫోటోలు సరిపోతాయి: రేవంత్

ప్రతి రాజకీయ పక్షం తమ సొంత పార్టీ నేతల ఫోటోలను పెట్టుకొంటుందని, రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు పెట్టుకొనే కొత్త బిచ్చగాళ్లు, పగ టి వేషగాళ్ల పార్టీలను ఇప్పుడే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. 'ఎన్టీఆర్ నిజాయతీకి మారుపేరు. తెలుగువారి ఆత్మాభిమానాన్ని దశదిశలా చాటిన నాయకుడు. ఆయన ఫొ టోను అవినీతి పార్టీ ఫ్లెక్సీలపై చేర్చి మలినపరుస్తున్నారు. ఇంతకన్నా దిగజారుడుతనం మరొకటి లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనపై పోరాటాలు చేశారు. ఆయన ఇంటిపై దాడికి వెళ్లి, కారుకు అడ్డం పడి గొడవ చేశారు.
ఎన్టీఆర్ తన జీవితంలో ఏనాడూ వైఎస్‌తో రాజీపడలేదు. వైఎస్ పేరు చెప్పుకొని ఓట్లు సంపాదించే రోజులు గతించాయన్న భయంతోనే ఎన్టీఆర్ ఫొటోలు అరువు తెచ్చుకొంటున్నా రు' అని విమర్శించారు. దావూద్ ఇబ్రహీం, ఇడీ అమీన్, ముషారఫ్ వంటి వారి ఫొటోలను వైసీపీ నేతలు ఫ్లెక్సీలపై వాడుకొంటే సముచితంగా ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్లలో దొంగల ఫొటోలుంటాయని, వాటిని తెచ్చి పెట్టుకొంటే దొంగల పార్టీ అన్న పేరు సార్థకమవుతుందని అన్నారు. ఫ్లెక్సీలతో సంబంధం లేకుంటే ఖండించాలని కోరారు.
Posted by
arjun
at
2:52 AM