
విశాఖపట్నం: చంద్రబాబు 'మీకోసం' పాదయాత్ర ముగింపు సభ విశాఖలోనే
జరగనుంది. ఈ నెల 27న జరగనున్న ఈ సభకు మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది.
శివార్లలో కంటే విశాఖలోనే సభ ఏర్పాటు చేయాలని సమావేశం ఏకగ్రీవంగా
తీర్మానించింది. జిల్లాలో పాదయాత్ర, బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు
నియోజకవర్గ ఇన్‌చార్జులతో శనివారం చంద్రబాబు భేటీ కానున్నారు.