April 3, 2013
దమ్ముంటే నాతో పోటీ చెయ్! కేసీఆర్‌కు తలసాని సవాల్
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు దమ్ముంటే..
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో తనతో పోటీ చేసి గెలవాలని టీడీపీ నేత
తలసాని శ్రీనివాసయాదవ్ సవాల్ విసిరారు. తాను ఓడితే రాజకీయ సన్యాసం
విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన దీక్షలను... ఎన్నికల కోసమేనంటూ కేసీఆర్ ఎద్దేవా చేయడంపై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌కు ఆదరణ లేదని.. కేసీఆర్‌కు దమ్ముంటే తనతో పోటీకి దిగాలన్నారు. బాబు పాదయాత్రతో ప్రజల్లో టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ అధినేత ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
Posted by
arjun
at
10:54 PM