April 3, 2013
ఆ చీకటి ప్రభుత్వం నుంచి, వెలుగు రేఖల వైపు.. పయనిద్దాం!

కేజీ బేసిన్ గ్యాస్ ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు పోతున్నా.. మన ఎంపీలు, కేంద్ర మంత్రులు దద్దమ్మల్లా వ్యవహరించి రాష్ట్ర ్ఞప్రయోజనాలను కాపాడలేకపోతున్నారని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చా కా.. కేజీ బేసిన్ గ్యాస్‌తో స్థానిక అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. లో వోల్టేజీతో వ్యవసాయ పంపుసెట్లు కాలిపోతున్నాయని, ఏటా ఒక్కో మోటార్‌కి రూ.15 వేల వరకు రైతుకు ఖర్చవుతోందన్నారు.
వేళాపాళాలేని విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రం గా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మూతపడుతున్న పరిశ్రమలు వేళాపాళాలేని విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతపడి లక్షలాది మం ది ఉపాధి కోల్పోతున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, యువకులు విద్యుత్ కోతలపై ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
లోక్‌సత్తా పార్టీ నేతలు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బృందం, పారిశ్రామికవేత్తల సం ఘం ప్రతినిధులు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఛాంబర్ ప్రతినిధులు, వినియోగదారుల మండలి ప్రతినిధులు, బ్రాహ్మణ సంఘం, పురోహిత సంఘం ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు చంద్రబాబు దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అండగా ఉంటామని వారంతా చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
Posted by
arjun
at
7:06 AM