
చోడవరంటౌన్ ఈ పాదయాత్రలో
తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. ఈనెల 27వ తేదీన మధురవాడలో పాదయాత్ర
ముగింపు సందర్భంగా స్తూపం ఏర్పాటు చేస్తామన్నారు. 200రోజులు పూర్తిచేసి
3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్టవుతుందన్నారు. జిల్లాలో చంద్రబాబు
పాదయాత్ర 180కిలోమీటర్లు వరకూ ఉంటుందని ఆయన తెలిపారు. విద్యుత్
సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు
కారకులన్నారు. రాష్ట్రానికి రావలసిన గ్యాస్, బొగ్గు వాటాలను తీసుకురావడంలో
వీరు విఫలమయ్యారన్నారు. చిన్న పరిశ్రమలకు కరెంటు హాలీడే ప్రభుత్వం ఇప్పటికే
ప్రకటించిందని, దీంతో 25లక్షల నుంచి 30లక్షల మంది కార్మికులు
రోడ్డునపడ్డారన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరెంటు
సమస్య పరిష్కారానికి ప్రతిరోజు అధికారులతో చర్చించి అనుకున్న కరెంటు సరఫరా
చేసేందుకు చర్యలు తీసుకొన్నారన్నారు. విద్యుత్ సమస్యపై ఎమ్మెల్యేలు దీక్ష
చేస్తే ఎటువంటి పరిష్కారం చూపకుండా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. విద్యుత్
సమస్యపై నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల వారీగా సంతకాలు సేకరించి
నెలాఖరున గవర్నర్‌కు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే
కేఎస్ఎన్ఎస్.రాజు, విశాఖ డెయిరీ డైరెక్టర్ దాడి గంగరాజు, మాజీసర్పంచ్
గూనూరు మల్లునాయుడు, వెల్లంకి మోదినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
: తెలుగుదేశం
పార్టీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్నా పాదయాత్ర ఈనెల 11 సాయంత్రం
నాలుగు గంటలకు జిల్లాలో ప్రవేశిస్తుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు
చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే
రాజు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, చంద్రబాబు పాదయాత్ర గన్నవరం
మెట్టవద్ద ప్రవేశిస్తారన్నారు. ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలో మూడు
రాత్రుళ్లు, నాలుగు పగళ్లు పర్యటిస్తారని, 14వ తేదీ రాత్రి అనకాపల్లి
నియోజకవర్గంలో కన్నూరుపాలెంలో ప్రవేశిస్తారన్నారు.