April 7, 2013
రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయండి టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు

సీఎం రాజీనామా చేయాలి: బొజ్జల, మండవ
కళంకిత మంత్రులను వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం వారు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. పరిటాల హత్య కేసు నుంచి వైఎస్ జగన్‌ను బయటపడేసేందుకు సహకరించానని ముఖ్యమంత్రే గతంలో చెప్పుకొన్నారని గుర్తుచేశారు. అదేవిధంగా ఇప్పుడు అవినీతి ఆరోపణలున్న మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. అందువల్ల కిరణ్‌కు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Posted by
arjun
at
9:45 PM