April 13, 2013
మీ కోసం .. మళ్లీ వస్తా!

అడుగడుగునా బాంబు స్క్వాడ్ తనిఖీలు
వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా శుక్రవారం కాకరాపల్లి శివారులో బస చేయడంతో అణువు అణువు బాంబు స్క్వాడ్ గాలించింది. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్‌తో సమీక్ష సమావేశం మొత్తం ఏరియాలను పరిశీలించారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
తుని: జిల్లాలో 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కాకరాపల్లి రాత్రి బస వద్ద జిల్లా డిక్లరేషన్‌ను ప్రకటించారు. అన్ని ప్రాంతాలకూ ప్రాధాన్యమిస్తునే.. అవసరమైతే మార్పులు, చేర్పులూ కూడా చేస్తామని బాబు స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంతో పాటు త్వరితగతిన పూర్తి చేసి ఆయకట్టు భూములకు నీరందజేస్తామన్నారు. ఏలేరు ఆధునికీకరణ పూర్తి చేయడం, పుష్కర, చాగల్నాడు పథకాలను పూర్తి చేసి ఆయకట్టు చివరి భూములకు సాగు నీరందిస్తామని చెప్పారు. గోదావరి డెల్టాను పూర్తిగా ఆధునికీకరిస్తామన్నారు. కాకినాడ, రాజమండ్రి, పట్టణాల్లో ఐటీ పరిశ్రమలను అభివృద్ధి చేసి వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో చ దివిన వారికి జిల్లాలోనే ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కోస్టల్ కారిడార్ అభివృద్ధికి కాకినాడ నుంచి విశాఖ పట్టణానికి ఆరు లేన్ల రోడ్డు వేస్తామన్నారు.
మత్స్యకారుల సమస్యలను పరిష్కరించి వారి ఉపాధికి చర్యలు చేపడతామన్నారు. కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. అ మలాపురంలో కొబ్బరిబోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర తీసుకువస్తామని తెలిపారు. కో నసీమ, కడియంలలో ప్రపంచ శ్రేణి నర్సరీలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైను ఏర్పాటు చేస్తామన్నారు. కేజీ బే సిన్ నుంచి పైపులైన్లను ఏర్పాటు చేసి ఇం టింటికీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని చెప్పా రు.
కత్తిపూడి పామర్రు 214వ నంబరు జా తీయ రహదారిని పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడ-రాజమండ్రిలను అవుటర్ రింగ్‌రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టును మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
జిల్లా డిక్లరేషన్ పట్ల టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు పర్వత చిట్టిబాబు, పెందుర్తి వెంకటేష్, నిమ్మకాయల చినరాజప్ప హర్షం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కోనసీమ అభివృద్ధికి డిక్లరేషన్‌లో చోటు కల్పించడం పట్ల బాబును దుశ్శాలువ కప్పి సత్కరించారు.
Posted by
arjun
at
8:44 AM