
నాతవరం/గొలుగొండ:
చంద్రబాబునాయుడు పాదయాత్ర సోమవారం తిరిగి ప్రారంభమవుతుందని పాదయాత్ర
ఇన్‌చార్జి, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి గరికపాటి రామ్మోహనరావు
తెలిపారు. శనివారం శృంగవరంలోని చంద్రబాబు క్యాంప్ కార్యాలయం వద్ద
విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ శనివారం విజయవాడకు చెందిన ఆర్ధోపెడిక్
శ్రీనివాసు వచ్చి చంద్రబాబునాయుడు కాళ్లనొప్పులకు సంబంధించి వైద్య
పరీక్షలు నిర్వహించి సోమవారం వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని
తెలిపారు. అయితే 15వ తేదీన కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే చంద్రబాబు
పాదయాత్ర ఉంటుందని, సోమవారం రాత్రి డి.ఎర్రవరం మదర్ కాలేజీలో చంద్రబాబు బస
చేస్తారని తెలిపారు.