April 14, 2013
కిరణ్‌కు బాబును విమర్శించే అర్హతేదీ?

ధ్వజమెత్తారు. తిరుపతిలో శనివారం విలేకరులతో మాట్లాడారు. 63 సంవత్సరాల వయస్సులో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి 195 రోజులుగా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసరడం బాధాకరమన్నారు. కలికిరి, ఢిల్లీ చుట్టూ విమానాల్లో ప్రదక్షిణ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లో కిరణ్ కీలుబొమ్మగా తయారయ్యారన్నారు. అవినీతి మంత్రులను తొలగించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు.
రాజ్యాంగంలోనే ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక చట్టం వుండగా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, ఎన్టీఆర్ హయాంలోనే ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు విద్య, వైద్య రంగాల్లో న్యాయం జరిగిందన్నారు. నల్లబెల్లంపై ఆంక్షలు విధించి చెరకు రైతులను ప లు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న కిరణ్ ప్రభుత్వం త్వరలోనే పతనం కాక తప్పదని జోస్యం చెప్పారు. జైల్లో ఉండాల్సిన టీటీడీ ఈవోకు సీఎం కిరణ్ అభయహస్తం ఇవ్వడం చూస్తుంటే దొంగల రాజుగా ఆయన్ను అభివర్ణించాల్సి వస్తోందన్నారు.
Posted by
arjun
at
4:03 AM