April 17, 2013
జూన్‌లో బాబు బస్సుయాత్ర..!

జిల్లాలో ఐదు రోజుల పా టు ఈ యాత్ర కొనసాగించాలని నిర్ణయించినట్లు సమా
చారం. పవిత్ర స్థలమైన పుట్టపర్తి నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో రెండేసి రోజులు, కదిరిలో ఒక రోజు బస్సు యాత్ర కొనసాగించనున్నట్లు తెలిసింది. ఈ యా త్ర ఐదు రోజులు కాకపోయినా.. కనీ సం నాలుగు రోజులైనా కొనసాగించే అవకాశాలున్నాయని సమాచారం. జి ల్లాలో యాత్ర ముగించుకొని చి త్తూరు వెళ్ళనున్నట్లు తెలిసింది. మే 27 నుంచి 29 వరకు మహానాడు వేడుకలు కొనసాగనున్నాయి. ఆ వెంటనే చంద్రబాబు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టునున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో టీడీపీ శ్రేణులను ఉత్తేజ పరచడానికి బాబు యాత్ర కొనసాగించనున్నారు.
Posted by
arjun
at
11:44 PM