
శాన్ హొసె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించే లక్ష్య సాధనలో భాగంగా అందరూ చంద్రబాబు
నాయుడుకు మద్దతు ప్రకటించాలని బే ఏరియా టి.డి.పి. కోరింది. ఆంధ్ర ప్రదేశ్
బంగారు భవితవ్యంకోసం అందరూ శనివారంనాడు కదిలిరావాలని ఈ సంస్థ కోరింది.
చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ శనివారం మధ్యాహ్నం
మిల్‌పిటాస్‌లోని సత్యనారాయణ ఆలయంలో పూజ జరుగుతుందని, ఆ తర్వాత సంఘీభావ
యాత్ర జరుగుతుందని సంస్థ నిర్వాహకులు వివరించారు.
: తెలుగు దేశం పార్టీ రథసారథి నారా చంద్రబాబు నాయుడు
ప్రారంభించిన వస్తున్నా.. మీకోసం పాదయాత్ర 200 రోజులు పూర్తి అయిన
సందర్భంగా కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో శనివారంనాడు సంఘీభావ యాత్ర
నిర్వహిస్తున్నట్టు
బే ఏరియా ఎన్.ఆర్.ఐ. టి.డి.పి. వెల్లడించింది.