March 21, 2013
పదండి ముందుకు

(జంగారెడి ్డగూడెం
జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ముగిసిన మరుసటిరోజే కరెంటు కోతలకు నిరసనగా ఆందోళనలు, ఆధార్ కేంద్రాల్లో జరుగుతున్న జాప్యంపై ధర్నాలు వంటివి చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలలోకి తీసుకువెళ్ళాలనే కృతనిశ్చయంతో తెలుగు తమ్ముళ్ళున్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించనున్న తరుణంలో పార్టీ కేడర్‌లో చంద్రబాబు నింపిన ఉత్సాహం టానిక్‌లా పనిచేస్తున్నది. స్తబ్దతగా ఉన్న ముఖ్యమైన కేడర్‌లో కదలిక వచ్చింది. గ్రామ కమిటీలను యాక్టివ్ చేయడంతో పాటు పూర్తి స్థాయి కమిటీలను సమర్థవంతంగా పనిచేయించాలనే సంకల్పంతో తెలుగు తమ్ముళ్ళు ముం దుకు కదులుతున్నారు. చంద్రబాబు పాదయాత్ర కారణంగా నెలకొన్న ఉత్సాహం సడలిపోకుండా కొనసాగించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు గ్రామంలో నెలకొన్న గ్రూపు విబేధాలకు చెక్‌పెట్టి కేడర్‌నంతా ఏకతాటిపైకి తెచ్చేందుకు సీనియర్‌లు ప్రయత్నిస్తున్నారు. గత సొసైటీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్య కార్యకర్తలకు కర్తవ్యబోధ చేస్తున్నారు. పంచాయతీల వారీగా సామాజిక వర్గాలను విశ్లేషిస్తూ బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించారు.
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలంటూ ఇటీవలే జరిగిన మండల టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానించారు. చంద్రబాబు జరిపిన సమీక్షలో క్షేత్రస్థాయి కమిటీల బా ధ్యులు హాజరు కాకపోవడంపై ఆయ న ఒకింత అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కింది నుంచి పై స్థాయి వరకు ఉన్న పార్టీ బాధ్యులను కార్యోన్ముఖులను చేసేందుకు సీనియర్లు నడుం బిగించారు. ఎలాగైనా సరే రానున్న స్థానిక పోరులో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. చింతలపూడి నియోజకవర్గానికి నాయకత్వలేమి ఉందంటూ కార్యకర్తలు బాబు దృష్టికి తీసుకువచ్చిన విషయంపై స్పందించిన ఆయన ఏడుగురితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. 2014లో జరగనున్న సాధారణ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంపై కూడా సమన్వయ కమిటీ దృష్టి సారించనుంది. ధీటైన అభ్యర్థిని అన్వేషించే పనిలో నియోజకవర్గ సమన్వయకర్తలున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలోని పార్టీ కేడర్ కు దిశా నిర్ధేశం చేసేందుకు న్నద్దమవుతున్నారు ఏయే కార్యక్రమాలను ఎపుడెపుడు నిర్వహించాలనే అంశంపై ఒక ప్రణాళిను రూ పొందించే పనిలో పడ్డారు. ముందుగా కేడర్‌ను సమాయత్త పరిచి తరువాత ప్రజలలోకి వెళ్లాలనే భావనలో తెలుగు తమ్ముళ్లున్నారు. మొత్తం మీద చంద్రబాబు పాదయాత్ర పార్టీ కేడర్‌లో నూతనోత్సాహన్ని నింపింది.
Posted by
arjun
at
11:39 PM