March 24, 2013
బాలయ్యకు బ్రహ్మరథం

రాష్ట్రంలో కాంగ్రెస్్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు అన్ని విధాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుస్థిర, సుపరిపాలనను అందించేందుకు తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ సమస్యను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల నిర్వాకం వల్ల ఈరోజు వేలాది కోట్ల రూపాయల సర్‌ఛార్జీ భారాన్ని ప్రజలు మోయాల్సి వచ్చిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరెంట్ తీగలు పట్టుకుంటే షాక్ కొడుతుందో లేదో తెలియదు కానీ విద్యుత్ బిల్లు పట్టుకుంటే మాత్రం షాక్ కొట్టి తీరుతుందన్నారు. నీలం తుపానులో ర్రాష్టానికి కేవలం 417 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల ఆయన ఆక్షేపణ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 30 మంది ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని విరుచుకుపడ్డారు. పాయకరావుపేట మండలం అక్కంపేట, కందిపూడి, రాజభూపాలపురం, కుమారపురం గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తనను కలుసుకోవడానికి వచ్చిన వృద్ధులను అక్కున చేర్చుకున్నారు.
ప్రజలతో మమేకమయ్యేందుకు బాలకృష్ణ ప్రయత్నించారు. పర్యటన ఆద్యంతం భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాయి. మహిళలు, యువత, వృద్ధులు బాలకృష్ణను చూసేందుకు ఎగబడ్డారు. రూరల్ జిల్లాలో సాగిన బాలయ్య పర్యటన ప్రజలను ఆకట్టుకోవడంతో పార్టీ శ్రేణులు హుషారుగా వున్నాయి.
Posted by
arjun
at
5:54 AM