February 3, 2013
పన్నులతో బాదేస్తున్నారు

ముఖ్యంగా రాష్ట్రంలో రాక్షస పాలన ఉందని, దీని నుంచి ప్రజలు ఎంత త్వరగా బయట పడితే అంత మంచిదన్నారు. పేదవాడికి మూడు సెంట్ల స్థలాన్ని ఇస్తే ఆనందంగా ఇల్లు నిర్మించుకుని బతుకుతాడు. ఆ పని చేయడానికి చేతులురాని కాంగ్రెస్ నాయకులు మాత్రం వేలాది ఎకరాల భూములను కబ్జా చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. బయ్యారం గనులే అందుకు నిదర్శనమన్నారు. సుమారు 1.36 లక్షల ఎకరాల భూములను తన అల్లుడికి వరకట్నంగా సమర్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిదేనన్నారు.
పేద వాళ్ళకు గ్యాస్ బండ.. గుదిబండగా మారిందన్నారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయినా ముఖ్యమంత్రి ఏమా త్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహాదోపిడీ జరుగుతోందన్నారు. విజయవాడలోని థర్మల్ పవర్ స్టేషన్ పరిస్థితి దీనంగా మారిందన్నారు. ఉత్పాదన బాగా తగ్గిందని దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం నాసిరకం బొగ్గు సరఫరా చేయడమే అని చంద్రబాబు విమిర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు చంద్రబాబును పలు ప్రశ్నలు అడిగారు.
పలువురు ప్రశ్నలు.. బాబు సమా«ధానాలు వల్లూరు భరణి: మీ హయాంలో ఐటీ బాగా అభివృద్ధి చేశారు. తిరిగి అధికారంలోకి వస్తే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి.
చంద్రబాబు: నిజమే తమ్ముడూ.. అందరికీ ఉద్యోగాలు రావాలి. ఆ పని చేయగలిగింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. అప్పుడే రాష్ట్రంలో పేదరికం పోతుంది. ఆనాడు టీడీపీ హయాంలో వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయి. కొత్తగా ఒక్క రోడ్డును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. గతుకులకు కనీసం మరమ్మతులు కూడా చేయలేని దుస్థితి ఈ ప్రభుత్వానిది.
వంశీ: రాష్ట్రంలో రైతులందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని మీరు ఆదుకోవాలి.
చంద్రబాబు: తప్పకుండా.. నా పాదయాత్రలో ఆధిక ప్రాధాన్యం రైతు సమస్యల పరిష్కారానికే.
చిలుకూరి శ్రీలక్ష్మి: మా అబ్బాయిని బాగా చదివించాను. మంచి మార్కులతో పాసయ్యాడు. అగ్ర కులాలకు చెందిన వారం కావడంతో ఉద్యోగం రావడం లేదు.
చంద్రబాబు: అగ్రవర్ణాల్లోనూ అనేక మంది పేదలున్నారు. నేను అధికారంలోకి రాగానే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యేలా చూస్తా.
Posted by
arjun
at
5:59 AM