February 3, 2013
వీళ్ల కష్టం ఊరికే పోదు!

ఆ చక్రాల కింద పడి చావక తప్పదు! ఆటో మొబైల్ ఇండస్ట్రీ.. విజయవాడలో ప్రధాన ఉపాధి కేంద్రం.. దాదాపు రెండు లక్షల మంది ఆధారపడిన పరిశ్రమ. ఒక బస్తీ బస్తీయే ఆ పనిలో ఉంది. కానీ, వాళ్లకు పనులు చేసేవారే లేరు. కనీసం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కూడా తమవద్ద లేదని ఆటో నగర్‌నుంచి వచ్చిన బృందం వాపోయింది.
వారంలో నాలుగు రోజులు కరెంటే ఉండటం లేదట. ఇలాగైతే వర్క్‌షాపులు ఎలా నడుపుకోవాలని ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు దీనంగా ప్రశ్నించారు. ఎలాంటి పరిశ్రమ ఎలాగయిపోయింది! స్వాతి థియేటర్ సెంటర్‌లో రోడ్డు పక్కన ఇద్దరమ్మాయిలు కనిపించారు. తోపుడు బండి పెట్టుకొని కిచిడీ అమ్ముతున్నారు.
దగ్గరకెళ్లి పలకరించాను. సమస్యలు ఆరా తీశాను. ఈ క్రమంలో వాళ్లు చెప్పినది విన్నప్పుడు ఏకకాలంలో గర్వమూ అంతులేని బాధా కలిగాయి. వారిలో ఒకరు ఎంబీఏ పూర్తి చేయగా, మరొకరు బీఎస్సీ చదువుతున్నారట. మంచి విద్యావంతులై కూడా స్వశక్తిని నమ్ముకోవడం ముచ్చటగొలిపింది. అయితే, చదువుకోవడం కోసం ఇంతలా కష్టపడుతున్నారని తెలిసి బాధపడ్డాను. వీళ్ల కష్టం ఊరికే పోదు. వీళ్లను ఇంత కష్టపెడుతున్న పాలకుల పాపమూ ఊరికే పోదు.
Posted by
arjun
at
6:08 AM