February 3, 2013
బాబు చేతికి జిల్లా రైతు సమస్యల చిట్టా

అలాగే ఎన్ఎస్‌పి 3వ జోన్ తిరువూరు, నూజివీడు, మైలవరం, నందిగామ, గన్నవరం నియోకవర్గాల్లో రెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు నవంబరు 15వ తేదీకి నీరు అందక ఆయా ప్రాంతాల్లో వేసిన పత్తి, మొక్కజొన్న, పొగాకు, మామిడి పం టలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యా మ్‌లో 511లు అనగా 134 టీఎంసీలు శ్రీశై లం డ్యామ్‌లో 860లు అనగా 112 టీఎంసీలు మొత్తం 246 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. నాగార్జున సాగర్‌లో 490 , శ్రీశైలంలో 850 అడుగుల నీరు ఉన్నపుడు కూడా టీడీపీ హయాంలో ఆదుకున్నట్లు పేర్కొన్నా రు. ఇక నాగార్జున సాగర్‌లో అవకతవకల గురించి కూడా ఈ లేఖలో ఆయ న పేర్కొన్నారు.
గతంలో ప్యాకేజీ నంబర్ 18 నాగార్జున సాగర్ ఆధునికీకరణలో రూ.10 కోట్ల పనికి రూ.23 కోట్లు అంచనాలు పెంచి బిల్లు చేయ డం, రాఘవ, బీవీఆర్ జాయింట్ వెం చర్ చేసిన ఈ పనిలో అవినీతి జరిగి రూ.8 కోట్ల రికవరీ చేయమని విచారణ కమిటీ చెప్పిందన్నారు. కానీ ప్రభుత్వం నజరానాగా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వారికి 10 కోట్లకు నూజివీడు మేజరు, బీవీఆర్‌కు వేంపాడు రూ.52 కోట్లకు పనులు ఇచ్చారన్నారు. కానీ రికవరీ మాత్రం ఇంత వరకు జరగలేదన్నారు. జగ్గయ్యపేటలో జల యజ్ఞం లో వైఎస్ మొదలు పెట్టిన మొదటి ప్రాజెక్టు మునేరుపై పోచంపల్లి నేటికీ పూర్తవలేదని, కనీసం సిల్టు కూడా తీయకపోవటం వల్ల ఒక పంట కూడా పండటం లేదన్నారు.
డెల్టా ఆధునికీకరణ కింద 2007లో రూ.2183 కోట్లతో ప్రారంభించిన పనులు నేటికి 8 శాతం కూడా పూర్తి కాలేదని, మోబిలైజేషన్ అడ్వాన్స్‌గా రూ.70 కోట్లు తీసుకున్నట్లు చెప్పారు. డ్రయినేజీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై కాలువలు బాగు చేయకపోవటంతో చివరి ప్రాంతాలకు నీరు వెళ్ళని పరిస్థితి ఉందన్నారు. పులిచింతల, తారక రామ ఎత్తిపోతల, పోలవరం పనులు పూర్తి కాలేదని, జిల్లాలో పోలవరం కాల్వలు తవ్వినా డ్యామ్ నిర్మాణం కాలేదన్నారు.
Posted by
arjun
at
5:55 AM