February 11, 2013
చంద్రబాబు పాదయాత్రకు బ్రహ్మరథం

ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతుందన్నారు. నేడు గుంటూరులో చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర సిద్దార్థ గార్డెన్స్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. అక్కడి నుంచి యాత్ర బృందావన్ గార్డెన్స్ మీదుగా సీతారామయ్య స్కూల్, అశోక్‌నగర్, దేవాపురం, కోబాల్డ్‌పేట, బ్రాడీపేట 4/14 వంతె న కింద నుంచి ఏటి అగ్రహారం చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి చుట్టుగుంట సెంటర్, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, పీర్లచావిడి, రామనామ క్షేత్రం నుంచి నల్లచెరువు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్దకు చేరుకుంటుందన్నారు.
అక్కడి నుండి దామోదర సంజీవయ్య నగర్ (డీయస్ నగర్) చేరుకుంటుందన్నా రు. అక్కడి బృందావన్ ఎన్‌క్లేవ్‌లో రా త్రికి బస చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జియా వుద్దీన్, బోనబోయిన శ్రీనివాస యాదవ్, మ న్నవ సుబ్బారావు, యాగంటి దుర్గారావు, ముత్తినేని రాజేష్, కొంపల్లి మా లకొండయ్య, చిట్టాబత్తిన చిట్టిబాబు, నర్రా బాలకృష్ణ, బొల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
6:16 AM