February 9, 2013
బాబు యాత్ర అదుర్స్

నియోజకవర్గంలో తన యాత్రకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూచి అధినేత చంద్రబాబు ముగ్థుడయ్యారని చెప్పారు. చేనేతల అభివృద్ధి కోసమై ఐదు వేల కోట్లతో ప్రత్యేక ప్రణాళికను తీసు కువస్తామని చంద్రబాబు మంగళగిరిలో ప్రకటిం చడం పట్ల పట్టణ దేశం అధ్యక్షులు నందం అబద ్దయ్య హర్షం వెలిబుచ్చారు. వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ను ఎత్తివేస్తామని, నేత కార్మికుల గృహ ని ర్మాణాలకు అదనంగా మరో రూ 50వేలను ఉచి తంగా ఇప్పిస్తామని బాబు ఇచ్చిన హమీలు తమ వర్గం వారికి ఎంతో ఉపశమనాన్ని కలిగించాయ న్నారు.
చేనేత రంగం సంక్షేమం పట్ల చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తారన్న విశ్వాసం తమకు వుం దన్నారు. తెలుగురైతు జిల్లా నాయకులు వల్లూరు సూరిబాబు మాట్లాడుతూ కిరికిరి సీఎం కిరణ్‌కు మార్‌రెడ్డి రుణమాఫీ అసాధ్యమని ప్రకటిం చడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫి చేయిస్తా మని ప్రకటించి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారన్నా రు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడ ఆయన తన నిశ్చితాభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పి సామాజిక న్యాయానికి ఎలా కట్టుబడి వున్నారో చా టుకున్నారని వల్లూరు ప్రశంసించారు. ఈ సమావే శంలో దేశం నేతలు సంకా బాలాజీగుప్తా, కోనంకి శ్రీనివాసరావు, మునగాల సత్యనారాయణ, మాది నేని శివరామకృష్ణయ్య, వాకా మంగారావు, డోగి పర్తి శ్రీనివాసరావు, గోవాడ రవి, పల్లపు పిచ్చియ్య తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:10 AM