January 26, 2013
పూలబాట

టీడీపీలో కూడా పరిటాలకు ఎంతో గుర్తింపు ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు. 117 అడుగుల పైలాన్ నిర్మాణానికి రూ.20 లక్షలు విలువచేసే స్థలాన్ని వితరణగా అందజేసిన కోగంటి రామారావును, పైలాన్ ఏర్పాటు చేయించిన కేశినేని నాని, ఇంజనీర్ ఎస్.వి. రమణ, చావా రమేష్‌లను చంద్రబాబు సన్మానించారు. సభకు హజరైన అందరితో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధికి, పేదరికం నిర్మూలనకు కృషి చేస్తానని, అవినీతిని సమూలంగా నిర్మూలిస్తానని, దేశ సంపదను ఇతర దేశాలకు తరలించకుండా కాపాడతానని, ఇప్పటికే తరలించుకుపోతున్న లక్షల కోట్ల రూపాయలను దేశానికి రప్పిస్తామని, ప్రజా ఆస్తులను కాపాడతానని, శాంతి సౌభాగ్యాలను పరిరక్షిస్తానని అంటూ త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నానని అంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
Posted by
arjun
at
11:49 PM