January 26, 2013
కాంగ్రెస్ పాలనలో రైతు జీవితం దారుణం

కరెంట్ ఇవ్వకపోయినప్పటికీ బిల్లులు మాత్రం వేలల్లో వేస్తున్నారు. సర్‌చార్జీల పేరుతో పేదలపై పెనుభారం మోపుతున్నారన్నారు. వ్యవసాయానికి కనీసం ఏడు గంటలు కూడా కరెంట్ ఇవ్వటం లేదని, ఇళ్లకు అయితే కరెంట్ ఉండటం లేదని, ఇప్పటికే 29 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని ఆరోపించారు. జగన్ దోచుకున్న లక్ష కోట్లతో ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు ఇవ్వటంతో పాటుగా రైతుల రుణాలను మాఫీ చేయవచ్చునని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన పక్షంలో చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ప్రజల సంపద ఇసుకను అక్రమంగా దోపిడీ చేస్తున్న వారిని విడిచిపెట్టి, పక్షపాతంతో పార్టీ కార్యకర్తలపై కేసు పెట్టటమేమిటని ప్రశ్నించారు. తనపై కూడా కాంగ్రెస్, వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టులకు వెళ్లారని అన్నారు. వస్త్ర వ్యాపారులపై వ్యాట్ విధించటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నారు.
వృద్ధులకు ప్రత్యేకంగా ఆశ్రమాలు ఏర్పాటు చేయటమే కాకుండా, నెలకు ఆరు వందల రూపాయల వంతున పింఛను ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆరోగ్యం సహకరించక పోయినా పాదయాత్ర కొనసాగించాలని ఉందని ఆయన తెలిపారు. అగ్రవర్ణాలలో పేదలకు ఉచితంగా విద్యతో పాటుగా కొలువు దొరికేంత వరకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా భృతి చెల్లిస్తామన్నారు. ముఖ్యంగా అవినీతి, ఇతర సమస్యలపై ప్రజలతో ఆయన కొద్దిసేపు ముఖాముఖి చర్చ నిర్వహించారు. అనంతరం రాత్రి 12.10లకు బస చేయడానికి వెళ్ళిపోయారు.
Posted by
arjun
at
12:07 AM