January 20, 2013
అడుగడుగునామ అపూర్వ స్వాగతం

మిర్యాలగూడకు చెందిన ప లువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గార్లపాటి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యం లో టీడీపీలోకి చేరారు. వారికి బాబు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వాని ంచారు. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన అయిదు వందల మంది సాఫ్ట్‌వేర్ విద్యార్థులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చావా కిరణ్మయి ఆధ్వర్యంలో బా బు మాస్క్‌లతో రోడ్డు వెంట నిలబడి సాదరస్వాగం పలికారు. ప్రస్తుత పాలనలో సాఫ్ట్‌వేర్‌రంగం నిర్వీర్యమై ఉపా ధి లేకుండా పోయిందని బాబు దృష్టికి తీసుకెళ్లారు. బాబు 2.30గంటలకు పా దయాత్రకు బ్రేక్ ఇచ్చి 2గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీ సుకున్న అనంతరం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాయకులతో సమీక్ష నిర్వహించారు.
మఠంపల్లి మండలం మేరీమాతా బృందం కోలాటం వేస్తుండగా కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, పాల్వాయి రజనీకుమారి, చావా కిరణ్మయి, బండ్రు శోభారాణి బృందం తో కలిసి వేసిన కోలాటం కార్యకర్తలు, అభిమానులను ఆకట్టుకుంది. విశ్రాం తి అనంతరం సాగిన పాదయాత్రలో బాబుకు హైద్రాబాద్‌కు చెందిన అస్లా మ్ దట్టి కట్టారు. విజయవాడకు చెం దిన కొందరు ముస్లింలు రోడ్డుపైన బా బుకు టోపీ ధరింపచేసి ఖురాన్ చదివి ఆశీర్వదించారు. అనంతరం 4.30 గం టలకు ప్రారంభమైన పాదయాత్ర గిరిజన తండాలైన పంతుల్‌తండాకు చేరుకోగానే గిరిజన సంప్రదాయ గీతాలతో బాబుకు స్వాగతం పలికి కోడిపుంజును బహూకరించారు. అక్కడ వారితో ము చ్చటించి ముందుకు సాగిన బాబు బీ క్యాతండా వద్ద గిరిజన స్వాగతాన్ని స్వీ కరించారు.
పూలదండలతో ఆయనకు స్వాగతం పలికిన గిరిజనులు తమకు సాగర్ నీరు రాక తీవ్రంగా ఇబ్బంది ప డుతున్నామని తెలిపారు. టీడీపీ ప్రభు త్వం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, త మ పార్టీని ఆశీర్వదించాలని ఆయన పే ర్కొన్నారు. అనంతరం రామలక్ష్మీపు రం క్రాస్‌రోడ్డు వరకు యాత్ర కొనసాగ గా రామలక్ష్మీపురానికి చెందిన వందలాది మంది ఎదురెళ్లి ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అ క్కడ పార్టీ జెండాను ఆవిష్కరించిన అ నంతరం జరిగిన బహిరంగ సభలో బాబు ప్రసంగించారు. సాగర్‌నీరు ఇ వ్వలేని ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం గణపవరం వరకు సాగినయాత్రతో ఎ ర్రవరం క్రాస్‌రోడ్డు వద్ద ముదిరాజ్‌లు ఆయన్ని సన్మానించారు. ముదిరాజ్‌ల ను బీసీ 'ఏ'లో చేర్చాలని వారు విజ్ఞప్తి చేయగా వారికి హామీ ఇచ్చి ముందుకు సాగారు.
గణపరం క్రాస్‌రోడ్డుకు చేరుకున్న బాబు బహిరంగ సభలో ప్రసంగిస్తూ సాగునీటి విషయంలో కిరణ్ స ర్కారు అవలంబిస్తున్న వైఖరిపై నిప్పు లు చెరిగారు. ఈ పాదయాత్రలో ఆ యనవెంట టీడీపీ నాయకులు మో త్కుపల్లి నర్సింహులు, వేనేపల్లి చందర్‌రావు, బీల్యానాయక్, రజనీకుమారి, సత్తయ్యగౌడ్, చావా కిరణ్మయి, నిరంజన్‌రెడ్డి, బండ్రు శోభారాణి, బొల్లం మల్లయ్యయాదవ్, పార సీతయ్య, పు ల్లూరి అచ్చయ్య, ఓరుగంటి బ్రహ్మం, పొలిశెట్టి బ్రహ్మం, పాలూరి, షఫీ, గం ధం పాండు, స్థానిక, స్థానికేతర, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
1:48 AM