January 20, 2013
పాదయాత్రకు తరలిన టీడీపీ నేతలు

డిండి మండలం నుంచి చంద్రబాబు యాత్రకు కోదాడకు శనివారం వాహనాలతో భారీగా తరలి వెళ్లారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గుర్రం రాములు, మండల పార్టీ అధ్యక్షుడు దొంతినేని భగవంతరావు ఆధ్వర్యంలో మండలంలోని నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంతో పాటు దేవరకొండలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోదాడకు తరలి వెళ్లిన వారిలోపోలం శ్రీను, ఖలీల్, సుధాకర్, కోటయ్య, కుక్కడాల శ్రీను, పురుషోత్తం పాల్గొన్నారు.
పాదయాత్రలో అరుణ్‌కుమార్
హాలియా : మీ కోసం పాద యాత్రలో మూడో రోజు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెంది న రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మువ్వా అరుణ్‌కుమార్ పాదయాత్రలో పా ల్గొని సంఘీభావం తెలిపారు. శుక్ర వారం తేరా చిన్నపరెడ్డి ఆధ్వ ర్యంలో నాగార్జునసాగర్ నియోజ కవర్గం నుం చి భారీ ర్యాలీతో వాహనాల్లో కార్య కర్తలు తరలి వెళ్లారు.
Posted by
arjun
at
1:47 AM