December 29, 2012
బాబు పాదయాత్రపై ఉత్కంఠ

ఉద్విగ్న పరిస్థితుల మధ్య...: సరిగా తెలంగాణపై ఢిల్లీలో అఖిల పక్షం సమావేశం
జరిగిన రోజుననే చంద్రబాబు జిల్లాలో అడుగుపెడుతున్నారు. మర్నాడు పాదయాత్రను మొదలు పెడుతున్నారు.
అప్పటికే అఖిలపక్ష సమావేశంలో టీడీపీతో సహా వివిధ రాజకీయ పార్టీల పక్షాన పాల్గొన్న ప్రతినిధులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఏం మాట్లాడింది, ఎలాంటి అభిప్రాయా లు వ్యక్తం
చేసింది, వారు వ్యక్తం చేసిన వైఖరులు సానుకూలంగా ఉన్నాయా? లేక ప్రతికూలంగానా? అన్న
సమాచారం జనానికి చేరిపోయి ఉంటుంది. దానిని బటే వాతావరణం నెలకొంటుంది. అది ఉద్విగ్నంగా
కావచ్చు. ఉద్వేగంగా ఉం డవచ్చు. లేదా ప్రశాంత నెలకొనవచ్చు. అప్పటికే ప్రజలు ఎదో ఒక విధమైన
భావోద్వేగానికి లోనై ఉంటారు. ఈ పరిస్థితుల మధ్య ప్రారంభమయ్యే బాబు పాదయాత్రపై ప్రభావం
ఎంతో కొంత ఉండకపోదు.
రాళ్ళు... పూలు...: అఖిలపక్ష సమావేశంలో టీడీపీ వెల్లడించిన వైఖరి తెలంగాణకు
సానుకూలంగా ఉంటే చిక్కేలేదు. ప్రజలు బ్రహ్మరథం పడతారు. అప్పటిదాక తెలంగాణవాదుల్లో ఉన్న
అపనమ్మకం తొలిగిపోయి దాని స్థానే సానుకూల దృక్పథం చోటు చేసుకుంటుంది. రాళ్ళు పట్టుకొని
సిద్ధంగా ఉన్న వారే పూలతో స్వాగతం పలుకుతారు. యాత్రకు రాచమార్గాన్ని వేస్తారు. సాఫిగా
సాగేందుకు సంపూర్ణంగా సహకరిస్తారు. లేకుంటే పర్యవసానం తీవ్రంగా ఉంటుం ది. యాత్ర ముందుకు
సాగడం కష్టం కావచ్చు. తెలంగాణవాదుల నుంచి ప్రధానం గా టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి అడుగడుగున
తీవ్ర ప్రతిఘటన ఎదురుకాక తప్పదు.
టీఆర్ఎస్ తెలంగాణ విషయంలో ఇప్పటికే జిల్లా లో టార్గెట్ చేస్తోంది. విమర్శనాస్త్రాలను
సంధిస్తోంది. సమైక్యవాద పార్టీ అని ము ద్రవేస్తోంది. ఈ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్ళడం
ద్వా రా తన స్ధానాన్ని పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తోం ది. గత నాలుగైదు రోజులుగా
ఆ పార్టీ నేతల నుంచి వస్తున్న హెచ్చరికలు కూడా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
టీడీపీ నేతలు కూడా ప్రతి సవాళ్ళు చేస్తున్నారు. అఖిల పక్షం సమావేశంలో వేర్పాటు వాదం
వినిపించని పార్టీల భరతం పడతామని తెలంగాణ జాక్ కూడా హెచ్చరించింది. ఈ మేరకు ఇచ్చిన
పిలుపు మేర కు గురువారం నగర వ్యాప్తంగా విద్యార్థులు మానవహారాలు నిర్వహించారు. కొన్ని
చోట్ల బాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.
తమ్ముళ్ళకు కొంత ఊరట..: బాబు తెలంగాణకు సానుకూలమేనని చెప్పడం ద్వారా టీడీపీ
హెచ్చరికలు, ప్ర కటనలను తిప్పికొడుతున్నారు. రెండు రోజులుగా తెలంగాణ విషయంలో చంద్రబాబు
చేస్తున్న ప్రకటను జిల్లా నేతకు, కార్యకర్తలకు ఊరట కలిగిస్తోం ది. 2008లోనే తె లంగాణకు
అనుకూలంగా లేఖ ఇచ్చాం. తెలంగాణకు తె లుగు దేశం వ్యతిరేకం కాదని చెప్పాం. తెలంగాణను
ఏర్పాటు చేయాలని లేఖలో కోరాం. మేం చెప్సాల్సిన అభిప్రాయం ఎప్పుడో 2008లో చెప్పాం. తెలంగాణకు
తెలుగుదేశం సానుకూలంగా ఉందని ఆ రోజే చెప్పాం. ఇప్పు డు వెనుక్కు ఎలా తీసుకుంటాం అని
బాబు విస్పష్టంగా చెబుతున్న మాటలతో ధైర్యం కలుగుతోంది. ఈ దృష్ట్యా అఖిల పక్షం సమావేశంలో
తెలంగాణ కు వ్యతిరేకంగా తమ పార్టీ నేతలు వ్యతిరేకంగా చెబుతారని అనుకోలేమని అంటున్నారు
Posted by
arjun
at
12:32 AM