December 29, 2012
నేనున్నాను...
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల అప్పులను పూర్తిగా మాఫీ చేస్తామని,
డ్వాక్రా మహిళల అప్పులను సైతం రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. రైతులకు 9గంటల పాటు
ఉచితంగా కరెంట్ ఇస్తామ ని, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను వ్యవసాయ పనులకు వినియోగిస్తామని, వ్యవసాయాన్ని
లాభసాటిగా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మంచినీళ్ళు దొరకడం లేదు కానీ మధ్యం మాత్రం
ఫుల్‌గా దొరుకుతోందన్నారు. మధ్యం విచ్చలవిడి విక్రయాల వల్ల నిరుపేదల కుటుంబాలు ఆర్ధికంగా
చితికిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను
పూర్తిగా మూసివేయిస్తానని ప్రకటించా రు. ఇందుకు సంబంధించిన సంతకం చేసేది రెండవ ఫైల్‌గా,
రైతుల అప్పుల మాఫీ మొదటి ఫైల్‌గా ఉంటుందన్నారు.
గ్రామస్తులకు బాబు వరాలను కురిపించారు. తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే
1400 ఎకరాలకు సాగునీరు అందేలా వెల్లంపల్లి వావిలా మధ్య వర్రెపైచెక్ డ్యాంను నిర్మిస్తుందని,
దుబ్యాల గుమ్మడిపల్లి మద్య బీటి రోడ్డు నిర్మిస్తుందని వాగ్దానం చేశారు. కులవృత్తులను
కాపాడుతామ ని, వెనుకబడి తరగతులవారిని ఆదుకుంటామని చెప్పారు. సరిగ్గా రెండు గంటలకు బాబు
దుబ్యాల గ్రామ శివార్లలో తన బస్సులోకి వెళ్ళిపోయా రు. మధ్నాహ్నం భోజనానంతరం కొద్ది
సేపు విశ్రాంతి తీసుకున్నారు. 4 గంటలకు తన పాదయాత్రను తిరిగి మొదలు పెట్టారు. రాఘవరెడ్డిపేట,
అంకుషాపురం మీదుగా సుబ్బక్కపల్లికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు.
Posted by
arjun
at
9:56 PM