December 29, 2012
బాబు పాదయాత్రకు సర్వం సన్నద్ధం

ఈనెల 29, 30, 31 తేదీల్లో మూడు రోజుల పాటు చంద్రబాబు జరిపే పాదయాత్ర అధికారిక
రూట్ మ్యాప్ షెడ్యూల్‌ను ప్రకాశ్‌రెడ్డి విడుదల చేశారు.
ఈ మూడు రోజులు బాబు మొత్తం 15.2 కిమీ దూరం పాదయాత్ర చేస్తారని చెప్పారు.
28వ తేదీ రాత్రి వెల్లంపల్లిలో బాబు బస చేస్తారని, మర్నాడు 29 ఉదయం పాదయాత్ర మొదల పెడ
తారని తెలిపారు. మొదటి రోజు భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని చిట్యాల, మొగుళ్ళపల్లి
మండలాల్లోని వెల్లంపల్లి, దుబ్యాల, రాఘవరెడ్డి, టేకుమట్ల, అంకుషాపురం, సుబ్బక్కపల్లి
గ్రామా ల్లో 13 కిమీ దూరం పాదయాత్ర చేస్తారని, రాత్రి సుబ్బక్కపల్లిలో బస చేస్తారని
చెప్పారు.
రెండవ రోజు 30న నవాబుపేట, మొగుళ్ళప ల్లి, ఇస్సిపేట గ్రామాల గుండా మరో
11.6 కిమీ దూరం బాబు పాదయాత్ర సాగిస్తారని తెలిపారు. రాత్రి ఇస్సిపేటలో బసచేస్తారని
తెలిపారు. మూడో రోజు 31వ తేదీన ఇస్సిపేట రంగాపురం పర్కాల మండలంలోని లక్ష్మిపురం, నాగారం,
పరకాల, కామారెడ్డి క్రాస్ రోడ్డు వరకు 3.1 కిమీ దూరం నడుస్తారని వివరించారు. కామారెడ్డిలోనే
రాత్రి బసచేస్తారని చెప్పారు. మిగిలిన పర్యటన వివరాలను మార్పులు, చేర్పులను బట్టి మూడు
నాలుగు రోజుల చొప్పున విడతల వారీగా ప్రకటి స్తామని చెప్పారు.
తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు
అప్రజాస్వా మికంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవ హరిస్తున్న టీఆర్ఎస్ పార్టీపై
ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని ప్రకాశ్‌రెడ్డి కోరారు. తెలం గాణకు అనుకూలంగా
2008లో చేసిన తీర్మానా నికి కట్టుబడి ఉన్నామని టీడీపీ చెబుతుండడంతో గత నాలుగైదు రోజులుగా
టీఆర్ఎస్ నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారనీ, ఇలా సానుకూల వైఖరిని ప్రదర్శిస్తుంటే
తమ పార్టీ పరిస్థితి ఏమ వుతోందని ఆందోళన చెందుతున్నారన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యు రాలు గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు
సీతక్క, సత్యవతి రాథోడ్, సీతక్క, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర
అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళి, జిల్లా ప్రచార
కార్యదర్శి పుల్లూరి అశోక్‌కుమార్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, కార్యా లయ సమన్వయ
కార్యదర్శి ఉడుతుల రవి యా దవ్, రాష్ట్ర బీసీ సెల్ ప్రచార కార్యదర్శి దొనికెల మల్లయ్య
తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
3:11 AM