December 27, 2012
పలకరింత.. పులకింత..

తన వద్దకు వ చ్చి సమస్యల గురించి వివరిస్తున్న ప్రజ లు, మహిళలను ఓదార్చుతూ
టీడీపీ అధికారంలోకి రాగానే వారి కష్టాలు తీరుతాయని హామి ఇస్తూ పరిష్కారం తన బా ధ్యత
అంటూ మెప్పించే ప్రయత్నం చే శారు. ఉదయం 11 గంటలకు మొదలైన పొలిట్‌బ్యూరో సమావేశం మధ్యాహ్నం
రెండు గంటల వరకు సాగింది. మూడు ప్రాంతాలకు చెందిన నేతలు తరలిరావడంతో ఈ ప్రాంతమంతా సందడిగా
మా రింది. జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకు లు, కార్యకర్తలు కూడా పొత్కపల్లికి తరలివచ్చారు.
సాయంత్రం పాదయాత్ర మొదలైన తర్వాత శానగొండలో 50 మంది గీత కార్మికులు చంద్రబాబుకు స్వాగతం
పలికారు. వారి వద్దకు వెళ్ళి మోకును ధ రించిన చంద్రబాబు గీతకార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని
హామి ఇచ్చారు.
అక్కడే పంచాయతీ సిబ్బందిని తమకు క నీస వేతనాలు కావాలని, పదవ తరగతి చదువుకున్న
కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని చంద్రబాబునాయుడుకు విన్నవించుకో గా తాము అధికారంలోకి
వస్తే తప్పకుం డా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్ర హణమొర్రితో ఉన్న గాజుల వర్షిణి
అనే అమ్మాయి తనకు ఒకసారి ఆపరేషన్ అ యిందని, మరో ఐదుసార్లు చేయాల్సి ఉం దని తన ఆర్థిక
స్థితిని విన్నవించగా ఆ మెకు ఆపరేషన్ చేయించి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఫించను
కావాల న్న కళావతికి, తాగునీరు ఇవ్వాలన్న ఓ దెమ్మ, లచ్చమ్మలకు పరిష్కారానికి హామి ఇచ్చారు.
సైకిల్ కావాలన్న గుంట సాయిలు, గ్యాస్ కనెక్షన్ ఇప్పించాలన్న జం గపల్లి రజిత, ఫించను
మంజూరు చేయాలన్న రామిడి వెంకటరెడ్డికి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
80 సంవత్సరాల వయసు ఉన్న బండారు మొండయ్య అనే వృద్ధుడు తాను నైజాం కాలం
నుంచి సుంకరిగా పని చేశానని, ఇప్పుడు ఉద్యోగం లేదు .. ఫించను లేదని గోడు వె ళ్ళబోసుకోగా
ఫించను ఇప్పిస్తానని హామి ఇచ్చారు. అనంతరం రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి వెళ్ళి మిర్చిలు
చేస్తున్న య జమానురాలు పూసాల రజితతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.తాను కూడా మిర్చి
బజ్జీలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు మిర్చి తినగా ... తెలంగాణ కారం ఎలా
ఉందంటూ ర జిత ప్రశ్నించగా 30 ఏళ్ళుగా ఇక్కడే ఉం టూ ఇదే కారం తింటున్నానని జవాబిచ్చి
అందరినీ నవ్వించారు. రజితకు రెండు వేల రూపాయలు అందజేశారు. బాయమ్మపల్లికి చెందిన వృద్ధురాలు
బాకారపు కొమురమ్మ ఆర్థిక స్థితిగతులు తెలుసుకొ ని రెండు వేల రూపాయలు అందించారు. గుంపుల
మార్గంలో అందరితో కలిసి రో డ్డుపైనే టీ తాగి కలివిడిగా వ్యవహరించా రు. పొలిట్‌బ్యూరో
సమావేశం కారణం గా పాదయాత్ర సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై నాలుగు గంటల పాటు సాగింది.
తెలంగాణ అంశంపై ఢిల్లీలో శు క్రవారం అఖిలపక్ష సమావేశం జరగను న్న నేపథ్యంలో
రెండు రోజుల పాటు క రీంనగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కీలక సమావేశాలు నిర్వహించింది.
తొలుత తె లంగాణ ప్రాంత నేతల అభిప్రాయాలను తెలుసుకున్న చంద్రబాబు తర్వాత సీ మాంధ్ర నేతలతోనూ
భేటీ అయ్యారు. ప లువురు సీనియర్ నేతలు జిల్లాకు తరలివ చ్చి తమ అభిప్రాయాలను చంద్రబాబు
దృష్టికి తీసుకువచ్చారు. గురువారం పొలిట్‌బ్యూరో సమావేశంలో కీలకమైన తెలంగాణ అంశంపై
సుదీర్ఘంగా చర్చించారు. రెండున్నర గంటల పాటు సాగిన ఈ స మావేశంలో అఖిలపక్ష సమావేశానికి
టీ డీపీ పక్షాన యనమల రామకృష్ణుడు, క డియం శ్రీహరిని పంపించాలని తీర్మానించారు. ఉత్తర
తెలంగాణ ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కరీంనగర్ జిల్లాలో పాదయాత్రను గురువారం
ము గించాల్సి ఉండగా 28న అఖిలపక్ష సమావేశం పూర్తయిన తర్వాతనే పాదయాత్ర వరంగల్ జిల్లాలో
అడుగుపెట్టేలా చూడాలని చంద్రబాబు నిర్ణయించడంతో కరీంనగర్ జిల్లాకు ఉన్న ప్రాధాన్యత
మరోమారు చాటిచెప్పినట్లయింది.
అవినీతి ... అభివృద్ధి ..తెలంగాణ...: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా
త పెరిగిన అవినీతిని ప్రధానంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు తన ప్రసంగాలను కొనసాగించారు.
అవినీతి పెరిగిపోవడం వల్లే ప్రజల కష్టాలు పెరిగాయని చెబుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం
చేశారు. చివరకు ఉద్యోగాలను కల్పించే ఏపీపీఎస్‌సీలోనూ అవినీతిపరులు, నేరచరిత్ర ఉన్న
వారినిు సభ్యులుగా నియమించారంటూ మండిపడ్డారు. ఈ కారణంగా అర్హత ఉన్న నిరుద్యోగులు అలాగే
ఉండిపోగా డబ్బు ఉన్నవారికే ఉద్యోగాలు దక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు, కన్నీళ్ళు తుడుస్తానని
చంద్రబా బు హామి ఇచ్చారు. తెలంగాణ ప్రాం తంలో తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప
కొత్తగా చేసిందేమీ లేదని ప్రజలకు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత
పథకాల పేర్లతో కోట్లు కొల్లగొట్టారే తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదంటూ విరుచుకుపడ్డారు.
తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని మ రోమారు స్పష్టం చేసిన చంద్రబాబు ప్ర జల మద్దతును
కూడగట్టుకునే విధంగా వారితో మమేకమయ్యారు. వారి సమస్య లు తెలుసుకుంటూ ... వాటి పరిష్కారానికి
హామీలిస్తూ ముందుకు సాగారు.
Posted by
arjun
at
9:39 PM