October 10, 2012
ఉత్సాహం…అదే పలుకరింపు
ఉత్సాహం…అదే పలుకరింపు
- జనంవైపు అడుగులు
- రోజుకు 20 కిలో మీటర్లు
- 117 రోజుల పాటు ప్రజల్లోనే
- 35 ఏళ్ళక్రితం మొదటి యాత్ర
- అప్పట్లో కాణిపాకం నుంచి చంద్రగిరి వరకు పాదయాత్ర
- సుదీర్ఘ ప్రసంగాల్లేవు
- వ్యవహార శైలిలో మార్పు
- ఆప్యాయంగా పలుకరింపు
- సామాన్య జనం మాట చంద్రబాబు నోట
- సాదాశీదాగా కులవృత్తుల ప్రతినిధులతో మమేకం
- పార్టీ శ్రేణులతో ప్రత్యక్ష సంబంధాలు
- స్థానిక నేతలతో పార్టీ అంశాలపై చర్చ
![]() |
old |
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా.. మీ కోసం యాత్రతో తెలుగుతమ్ముళ్లలో నూతనోత్తేజం కనిపిస్తోంది. సరాసరి రోజుకు 20 కిలో మీటర్ల చొప్పున నడుస్తూ… 117 రోజులపాటు ప్రజల కష్టాల్ని మరింత దగ్గరగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బాబు.ప్రజల్లోకి వెళ్లేందుకు బాబు పాదయాత్ర చేయడం కొత్తేమీ కాదు. 35 ఏళ్ల కిందట చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి పాదయాత్ర చేసి గడప గడపా తొక్కారు. మూడు పదుల వయసులో ఆనాడు బాబు చేసిన యాత్రకు విశేష స్పందన వచ్చింది. కాణిపాకం నుంచి చంద్రగిరి వరకూ సాగిన ఆ టూర్… ఇప్పటికీ అక్కడి జనం కళ్లముందు కదులుతూనే ఉంది. యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పటి నుంచే ప్రజల పక్షాన ఎన్నోపోరాటాలు … పాదయాత్రలు చేశారు బాబు.
![]() |
new |
by.....pravasarajyam.com
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments :
Post a Comment