September 12, 2013
ముఖ్యమంత్రికి సిగ్గుంటే రాజీనామా చేయాలి: టిడిపి
ముఖ్యమంత్రికి
సిగ్గుంటే సమాచార కమిషనర్ల నియామకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు నైతిక
బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్
చేసింది. గురువారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో ఆ పార్టీ ప్రధానకార్యదర్శి వర్ల
రామయ్య విలేకరులతో మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కింద నియమించే
కమిషనర్లకు ఉండాల్సిన అర్హతలపై చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నా వాటిని
తోసిరాజని తమ పార్టీకి చెందిన క్రియాశీల రాజకీయ నాయకులను ఈ పదవిలో
నియమించాలని ముఖ్యమంత్రి చూడటం దారుణమని, అందుకే కోర్టు ఆయనకు చెంపపెట్టు
వంటి తీర్పు ఇచ్చిందని వర్ల వ్యాఖ్యానించారు.
'పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి మీద ఇంతియాజ్ అహ్మద్ టిడిపి అభ్యర్దిగా పోటీచేసి ఓడిపోయారు. ఆయనను ప్రలోభపెట్టి కాంగ్రెస్‌లోకి తీసుకొని సమాచార కమిషనర్‌గా నియమిస్తారా? ఈ పదవులు ఉంది రాజకీయ పునరావాసానికేనా? తాంతియా కుమారి కాంగ్రెస్ తరపున జడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. విజయనిర్మల పోయిన ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్దిగా పోటీచేసి ఆ పార్టీతోపాటు కాంగ్రెస్‌లో చేరారు.
Posted by
arjun
at
10:06 AM