September 3, 2013
షిండే విదర్భ రాష్ట్రం ఏర్పాటు గురించి ఎందుకు మాట్లాడడం లేదు! యు.పిని ఎందుకు విభజించడం లేదు-బాబు
తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు కేంద్రం ఉత్తరప్రదేశ్ ను ఎందుకు
విభజించడం లేదని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో ఆయన బస్ యాత్ర లో
మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి షిండే విదర్భ రాష్ట్రం ఏర్పాటు గురించి
ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. తెలుగురాష్ట్రాన్ని మాత్రం రెండు ముక్కలు
చేయాలని అనుకుంటోందని ఆయన విమర్శించారు. సోనియా పెంపుడు కుక్కలు గా ఉన్న
ఎమ్.పిలు తన మీద మొరుగుతారే కాని,సోనియాగాందీని అడగడం లేదని ఆయన
ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే ఎన్నికలు వస్తాయని,
తాను అదికారంఓకి వస్తే ఆరు నెలల్లో సమస్య పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.
Posted by
arjun
at
3:17 AM