టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఢిల్లీ
చేరుకున్నారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు
ఢిల్లీలోనే ఉంటానని, ప్రధాన రాజకీయ నేతలందరినీ కలువనున్నట్లు తెలిపారు.
వారికి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తానన్నారు. ఎవరితోనూ రాజకీయాలు
మాట్లాడనని చంద్రబాబు తెలిపారు. మరికాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో
చంద్రబాబు భేటీ కానున్నారు.