August 7, 2013
నేనే సి.ఎమ్. అయితే నిమిషంలో రాజీనామా : మోదుగుల
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై
నరసరావుపేట టిడిపి ఎమ్.పి మోదుగుల వేణుగోపాలరెడ్డి తీవ్రంగా
ధ్వజమెత్తారు.ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా తీర్మానాలు చేయడం ఏమిటని ఆయన
ప్రశ్నించారు.తాను ముఖ్యమంత్రి ని అయితే విభజనకు ఒప్పుకోనని ఒక్క నిమిషంలో
రాజీనామా చేసేవాడిని అని ఆయన అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు
వారికి కనబడడం లేదా అని ఆయన అన్నారు.పిసిసి అధ్యక్షుడు సమైక్యం అంటారు,ఆయన
భార్య ప్లకార్డు పట్టుకోరు ..ఏమిటీ డ్రామాలు అని ఆయన తీవ్రంగా
వ్యాఖ్యానించారు.
Posted by
arjun
at
1:53 AM